ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళింది! కానీ..ఒక్క ఘటనతో అంతా తారుమారు!

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళింది! కానీ..ఒక్క ఘటనతో అంతా తారుమారు!

ఎంతో మంది తమ ఆశయాలను సాధించుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు అయితే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతుంటారు. అలానే ఎన్నో ఆశలతో వెళ్లిన ఓ యువతి విషయంలో ఓ సంఘటన విషాదం మిగిల్చింది.

ఎంతో మంది తమ ఆశయాలను సాధించుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు అయితే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతుంటారు. అలానే ఎన్నో ఆశలతో వెళ్లిన ఓ యువతి విషయంలో ఓ సంఘటన విషాదం మిగిల్చింది.

ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని కలలు కంటారు. తమ ఆశయాలను సాధించుకునేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటారు. మరికొందరు అయితే విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో వారికి భారంగా కాకుండా పార్ట్ టైమ్ జాబ్ లు చేసుకుంటూ చదువులను పూర్తి చేస్తారు. అలానే ఎన్నో ఆశలతో మన తెలుగు అమ్మాయి అమెరికా వెళ్లింది. అయితే ఆమె ఆశలు చిధ్రమయ్యేలా, తల్లిదండ్రులకు గుండెకోత మిగిలేలా ఆ యువతికి దారుణం జరిగింది. గ్రామస్థులు, కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా లోని యాదగిరి పల్లెకు చెందిన కోటేశ్వరరావు, బాలమణి దంపతులు. వీరి స్థానికంగా పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి సౌమ్య అనే కుమార్తె ఉంది. ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అంతేకాక తమ కుమార్తెను బాగా చదివించి… ఉన్నత స్థితిలో చూడాలని ఆ దంపతులు ఆశ పడ్డారు. వారి ఆశలను నిజం చేసే దిశగానే సౌమ్య అడుగులు పడ్డాయి.  సొంత ఊర్లో బాగా చదువుకుని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇక తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను నిత్యం గుర్తు చేసుకుంటూ చదువుకుటుంది. తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుడాదని సౌమ్య  పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువును కొనసాగించింది.

త్వరలో స్టడీని పూర్తి చేసి..తమకు ఎంతో అండగా ఉంటుందని సౌమ్య తల్లిదండ్రులు భావించారు. తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు…వారి ఆశలపై విధి నీళ్ళుల చల్లింది. సౌమ్య రోడ్డు ప్రమాదానికి గురై.. మృతి చెందింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఆదివారం ఉదయం సౌమ్య రోడ్డుపై నడ్చుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ కారు సౌమ్యను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కావడంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు మృతిచెందుతున్నారు.  కారణాలు ఏమైనప్పటికి.. ఇలా భారతీయ విద్యార్థుల మరణాలు చోటుచేసుకోవడం..అక్కడ ఉండే విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తున్నాయి.  రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి ఘటనలతో మన విద్యార్థులు మరణిస్తున్నారు. వారం రోజుల క్రితమే ముగ్గురు విద్యార్థులు కన్నుమూశారు. అలానే కొన్ని రోజుల క్రితం భారతీయ విద్యార్థులు హత్యకు గురయ్యారు. దీంతో అమెరికా పంపించాలని ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు కాస్తా వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా సౌమ్య ఘటనతో ఆమె కుటుంబం విషాదంలో మునిగింది.

Show comments