iDreamPost
android-app
ios-app

పండగ వేళ విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

  • Published Jan 14, 2024 | 3:45 PM Updated Updated Jan 14, 2024 | 3:45 PM

పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఎదిగొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పండగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఎదిగొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

  • Published Jan 14, 2024 | 3:45 PMUpdated Jan 14, 2024 | 3:45 PM
పండగ వేళ విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా రెట్టింపైన ఆనందంతో సంక్రాంతి వేడుకల్లో మునిగితేలుతున్నారు. ఈ ఆనంద సమయాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల అమెరికాలో ఉంటున్న తెలుగు వారు కొందరు రోడ్డు ప్రమాదాల్లో, హార్ట్ ఎటాక్, ఇంకా ఇతర కారణాలతో మరణించిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు విద్యార్థి మరణించాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పండగ వేళ ఎదిగొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

వనపర్తి పట్టణం 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేష్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగొస్తడనుకున్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. అమెరికాలో ఉంటున్న దినేష్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతడు నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దినేష్ తో పాటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందినట్లు వెల్లడించారు.

ఈ ఇద్దరి తెలుగు విద్యార్థుల మృతితో ఆ కుటుంబాల్లో పండగ వేళ విషాదం అలుముకుంది. కాగా అక్కడి నుంచి దినేష్ భౌతికకాయాన్ని తరలించేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అద్దె ఇంట్లో ఉంటున్న దినేష్ నిద్రలోనే హార్ట్ ఎటాక్ తో మరణించాడా లేదా ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom