Swetha
తెలంగాణ అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ .. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రావట్లేదు. దీనితో ఈ విషయం అనేక రకాల చర్చలకు దారితీసింది. ఈ క్రమంలో స్వయంగా ఆమె అధికారికంగా ఈ విషయాలపై స్పందించారు.
తెలంగాణ అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ .. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రావట్లేదు. దీనితో ఈ విషయం అనేక రకాల చర్చలకు దారితీసింది. ఈ క్రమంలో స్వయంగా ఆమె అధికారికంగా ఈ విషయాలపై స్పందించారు.
Swetha
తెలంగాణాలో అటవీ, పర్యావరణ , దేవాదాయ శాఖ విభాగాల మంత్రిగా ..కొండా సురేఖ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, గత కొంతకాలంగా ఆమె బయటకు రావడంలేదు. అలానే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలలోను ఆమె పాల్గొనడంలేదు. దీనితో కొండా సురేఖపై అటు మీడియా లోను, ఇటు సోషల్ మీడియాలోనూ ఆమె అసలు ఏమైపోయారు అనే వార్తలు, ఆమెపై రకరకాల కథనాలు , పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కొండా సురేఖ స్వయంగా .. ఈ విషయాలపై స్పందించి.. అందుకు గల కారణాలను అధికారికంగా అందరికి తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కొండా సురేఖ మీడియా ముందుకు రాకపోవడంతో.. అలాగే ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనకపోవడంతో.. ఈ విషయం ఇప్పటివరకు అనేక రకాల చర్చలకు దారి తీసింది. ఇక వీటిన్నటికి ఫుల్ స్టాప్ పెట్టారు కొండా సురేఖ. స్వయంగా ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసుకుని.. అందులో ఆమె బయటకు రాలేకపోవడానికి గల కారణాలను వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో మీడియాలో వచ్చిన అనేక రకాల చర్చలకు సమాధానంగా నిలిచింది. ఆ వీడియోలో ఆమె గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో భాదపడుతున్న కారణంగా బయటకు రాలేక పోతున్న అని తెలిపారు. అలాగే ప్రజలు తన పరిస్థితిని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంకా ఆ వీడియోలో కొండా సురేఖ మాట్లాడుతూ.. “గత కొన్ని రోజులుగా నేను అసెంబ్లీ రాకపోవడం, ప్రజల మధ్య కనిపించకపోవడంతో.. ఎందుకు రావట్లేదు అనే చర్చ సాగుతోంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే బయటకు రాలేక, ఇంట్లోనే ఉంటున్నాను. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాను” అంటూ సురేఖ చెప్పుకొచ్చారు.