P Venkatesh
మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.
మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.
P Venkatesh
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతోంది. నిన్న అనగా డిసెంబర్ 07న కొలువుదీరిన తెలంగాణ కొత్త ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పథకంతో పాటు మరో ఐదు గ్యారంటీలను కూడా హస్తం పార్టీ ప్రకటించింది. అయితే ముందుగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపారు.
అనంతరం డిసెంబర్ 09 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంపై జీవో జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ గవర్నమెంట్. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేల జీవోలో పేర్కొన్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం మహాలక్ష్మీ పథకం. కాబట్టి మహిళా ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు డిసెంబర్ 9 నుండి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. pic.twitter.com/eYJ0n3U9Wl
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2023