Venkateswarlu
Venkateswarlu
తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్లకు శుభవార్త అందించింది. రేషన్ డీలర్ల కమీషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్ల కమీషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్నుకు రేషన్ డీలర్ల కమీషన్ ప్రస్తుతం 700 ఉంది. ఇప్పుడు దాన్ని డబుల్ చేసింది. 1400 లకు పెంచింది. కమీషన్‌ను పెంచటం ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ఏటా 245 కోట్లరూపాయలు భారం పడనుంది. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17 వేల మంది రేషన్ డీలర్ల కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. ఇక, ఈ విషయంపై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా సేవలందించాలని అన్నారు. అనంతరం రేషన్ డీలర్ల కమీషన్ పెంపు జీవోను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు. మరి, తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్ల కమీషన్‌ను 700 రూపాయల నుంచి ఏకంగా 1400 చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: తెలంగాణ ఎన్నికల బరిలో హీరో నితిన్.. ఆ పార్టీ కోసం రంగంలోకి