iDreamPost

తెలంగాణ ఎన్నికల బరిలో హీరో నితిన్‌.. ఆ పార్టీ కోసం రంగంలోకి

  • Published Sep 30, 2023 | 2:28 PMUpdated Sep 30, 2023 | 3:08 PM
  • Published Sep 30, 2023 | 2:28 PMUpdated Sep 30, 2023 | 3:08 PM
తెలంగాణ ఎన్నికల బరిలో హీరో నితిన్‌.. ఆ పార్టీ కోసం రంగంలోకి

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. పార్టీలన్ని అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఇక ఎన్నికలు అంటే.. కచ్చితంగా ఏదో ఒక పార్టీ తరఫున సినీ తారలు ప్రచారం చేస్తారు. అలా ఈసారి హీరో నితిన్‌ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఇంతకు నితిన్‌ ఏ పార్టీ తరఫున బరిలో దిగబోతున్నారు అంటే..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. కాంగ్రెస్‌ పార్టీ సినీ గ్లామర్‌ అద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హీరో నితిన్‌ని రంగంలోకి దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే నితిన్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన దగ్గరి బంధువు, మేనమామ, పీసీసీ కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్‌ రెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో నగేష్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే.. నితిన్‌ ఆయన తరఫున ప్రచారం చేస్తారని.. ఇది పార్టీకి కలసి వస్తుందని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు టీకాంగ్రెస్‌ పెద్దలు. అన్ని అనుకూలిస్తే.. నితిన్‌ కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి