రెయిన్ ఎఫెక్ట్: సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు కొన్ని గ్రామాలు సైతం నీట మునిగాయి. ఇక వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంతో మంది ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై NDRFబృందాలు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. అధికార యాంత్రాంగం సైతం పరిస్థితి దారుణంగా ఉన్న గ్రామాల్లోకి ఎన్టీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ హెలీకాప్టర్లు సైతం పంపిస్తున్నారు. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు అంతా గ్రామాల్లోకి చేరుపోతోంది. దీంతో ప్రజలకు అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.

అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో NDRFబృందాలతో పాటు వైద్య శాఖను కూడా అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య సిబ్బంది సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, దీని కారణంగానే ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే అనుమతి పొందిన ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేయాలని డీహెచ్ శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: నీట మునిగిన లేడీస్ హాస్టల్.. సాయం కోసం విద్యార్థుల ఎదురు చూపు

Show comments