iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. 55 స్థానాలు ఖరారు!

  • Published Oct 15, 2023 | 12:13 PM Updated Updated Oct 15, 2023 | 12:51 PM
  • Published Oct 15, 2023 | 12:13 PMUpdated Oct 15, 2023 | 12:51 PM
కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. 55 స్థానాలు ఖరారు!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. అధికార, ప్రతిపక్ష నేతలు ఇప్పటికే తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో మాత్రం అభ్యర్థుల విషయంలో తర్జన్ భర్జన కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతుందని ఈసీఈ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల్లో సందడి మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నేడు సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు పేర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా ఈరోజు రిలీజ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. ప్రస్తుతం తొలివిడతా 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ తొలి జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేడు ఆదివారం రోజు రిలీజ్ చేశారు. కాగా, తొలి జాబితాలో 12 మంది ఎస్సీ స్థానాలు, 2 ఎస్టీ స్థానాలు, వెలమ 7, రెడ్డి 17, బీసీ 13, బ్రహ్మణ 2, ముస్లిం 3 టికెట్లు దక్కాయి. మిగిలిన నియోజకవర్గాల జాబితాను అక్టోబర్ 25 లోపు ప్రకటించేందుకు సిద్దం అవుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు :

1.బెల్లంపల్లి (ఎస్సీ) – గడ్డం వినోద్
2.మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
నిర్మల్ – శ్రీహరి రావు
ఆర్మూర్ – ప్రొద్దటూరి వినయ్ కుమార్ రెడ్డి
బోధన్ – పి. సుదర్శన్ రెడ్డి
బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
జగిత్యాల – టి. జీవన్ రెడ్డి
ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం – ఎం.ఎస్. రాజ్ థరూర్
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి – చింతకుంట విజయ్ రమణారావు
వేములవాడ – ఆది శ్రీనివాస్
మానుకొండూర్ (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు.
అందోల్ (ఎస్సీ) – దామోదర్ రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ) – ఆగం చంద్రశేఖర్.
సంగారెడ్డి – జగ్గారెడ్డి
గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్ – తోటకూర వజ్రేశ్ యాదవ్
మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కొలన్ హన్మంత్ రెడ్డి
ఉప్పల్ – ఎం. పరమేశ్వర్ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ) – భీమ్ భరత్
పరిగి – టి. రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
మలక్ పేట – షేక్ అక్బర్
సనత్ నగర్ – కోట నీలిమ
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
గోషామహల్ – మొగిలి సునీత
చాంద్రయణగుట్ట – బోయ నగేశ్ (నరేశ్)
యాకత్ పుర – కె. రవిరాజు
బహదూర్ పుర – రాజేశ్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్ – ఎ. సంతోష్ కుమార్
కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి
గద్వాల – సరితా తిరుపతయ్య
అలంపూర్ (ఎస్సీ) – సంపత్ కుమార్
నాగర్ కర్నూల్ – కూచకుళ్ల రాజేశ్ రెడ్డి
అచ్చంపేట్ (ఎస్సీ) – చిక్కుడు వంశీకృష్ణ
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్ రెడ్డి
షాద్ నగర్ – కె. శంకరయ్య
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్ – కుందూరు జయవీర్
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – పద్మావతి రెడ్డి
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – వేముల వీరేశం
ఆలేరు – బీర్ల ఐలయ్య
స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
నర్సంపేట – దొంతి మాధవ్ రెడ్డి
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
ములుగు (ఎస్టీ ) – ధనసరి సీతక్క
మధిర (ఎస్సీ) – మల్లు భట్టి విక్రమార్క
భద్రాచలం (ఎస్టీ) – పొదెం వీరయ్య