iDreamPost

వీడియో: USలో మరో తెలుగు విద్యార్థిపై దాడి.. తెలుగు వాళ్లే టార్గెటా?

యూఎస్ లో మరో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్ కు చెందిన విద్యార్థిపై యూఎస్ లోని చికాగోలో దుండగులు దాడి చేసి గాయపరిచారు. రక్తం కారుతుండగానే వీడయో ద్వారా తనక సహాయం చేయాలంటూ వేడుకున్నాడు.

యూఎస్ లో మరో తెలుగు విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్ కు చెందిన విద్యార్థిపై యూఎస్ లోని చికాగోలో దుండగులు దాడి చేసి గాయపరిచారు. రక్తం కారుతుండగానే వీడయో ద్వారా తనక సహాయం చేయాలంటూ వేడుకున్నాడు.

వీడియో: USలో మరో తెలుగు విద్యార్థిపై దాడి.. తెలుగు వాళ్లే టార్గెటా?

అమెరికాకు విద్యా ఉపాధి అవకాశాల కోసం భారత్ నుంచి ప్రతీ ఏటా చాలా మందే వెళ్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాగా ఇటీవల అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దుండగులు వరుసగా దాడులకు పాల్పడుతుండడంతో భారత్ నుంచి పై చదువుల కోసం యూఎస్ కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అమెరికాలో జాత్యాహంకార దాడులతో భారత్ లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్ కు చెందిన విద్యార్థిపై దుండుగులు దాడికి పాల్పడ్డారు.

హైదరాబాద్ కు చెందిన సయ్యద్‌ మజహిర్‌ అలీపై అమెరికాలోని షికాగోలో దాడి జరిగింది. అతడు ఇంటికి వెళ్తున్న సమయంలో ముగ్గురు దుండగులు అతడిని వెంబడించి దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా దానిని పోలీసులు రిలీజ్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. దారి దోపిడీకి పాల్పడిన దుండగులు సయ్యద్ పై భౌతిక దాడికి పాల్పడి రక్తం వచ్చేలా కొట్టారు. కాగా ఈ దాడి అతడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే జరిగినట్లు తెలుస్తోంది. దుండగుల దాడుల్లో గాయపడిన సయ్యద్ తల, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతుండగా.. అదే పరిస్థితుల్లో దాడికి సంబంధించిన వివరాలను తెలుపుతూ తనకు హెల్ప్ చేయండంటూ వేడుకున్నాడు. దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అలీని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కాగా సయ్యద్‌ మజహిర్‌ అలీ ఇండియన్‌ వెస్లియన్‌ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్‌ చేస్తున్నాడు. ఇక ఈ దాడి ఘటనపై సయ్యద్ భార్య భారత విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసింది. తన భ‌ర్త‌ను ఆదుకోవాల‌ని బాధితుడి భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ శాఖ‌ను వేడుకుంది. ఆయ‌న‌కు మెరుగైన చికిత్సను అందించాల‌ని మంత్రి జైశంక‌ర్‌ను కోరారు. త‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని తన భర్త భద్రతా విషయంలో ఆందోళనగా ఉందని తెలిపింది. త‌న భ‌ర్త‌ దగ్గరకు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె విదేశాంగ శాఖ‌ను కోరుకున్న‌ది.

ఇక గత వారం మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి శవమై కనిపించిన సంగతి తెలిసిందే. భారత్ కు చెందిన నీల్ ఆచార్య, వివేక్ సైనీ, అకుల్ ధావన్ దుండగుల దాడుల్లో మరణించారు. ఇక ఇప్పుడు తాజా ఘటనతో భారత్ లో ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. కాగా ఇటీవల తెలుగు విద్యార్థులపై దాడులు ఎక్కువవుతుండడంతో దుండగుల టార్గెట్ తెలుగువాళ్లేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో యూఎస్ లో ఉంటున్న విద్యార్థుల, ఎన్నారైల కుటుంబాలు తమ వాళ్ళకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి