iDreamPost
android-app
ios-app

AP-Telangana: సంక్రాంతి పండగ.. సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్!

  • Published Dec 24, 2023 | 5:14 PM Updated Updated Dec 24, 2023 | 5:14 PM

సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే తెలుగు ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే తెలుగు ప్రజలకు ఓ గుడ్ న్యూస్.. ఆ వివరాల్లోకి వెళితే..

AP-Telangana: సంక్రాంతి పండగ.. సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతిని అత్యంత అద్భుతంగా జరుపుకుంటారు. అయితే ఉపాధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వివిధ ప్రాంతాల్లోకి వలస వెళ్తుంటారు. పండగల కోసం తమ సొంతూళ్లకు పయణమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బస్సుల్లో, రైళ్లలో చెప్పలేనంత రద్దీ ఉంటుంది. కనీసం నిల్చోవడానికి అంగుళం చోటు కూడా ఉండదంటే అతిశయోక్తికాదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండక్కి సొంత ఊర్లకు వెళ్లే వారికి శుభవార్త చెప్పింది సౌత్ సెంట్రల్ రైల్వే. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. ఉపాధి కోసం తెలంగాణ, ఏపీ ప్రజలు వివిధ నగరాలకు వసల వెళ్తుంటారు. అలాంటి వారు కేవలం పండుగల సందర్భాల్లోనే తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రజా రవాణాలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ప్రత్యేక ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ట్రైన్లు నడపనన్నట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

హైదారాబాద్ నుంచి తిరుపతికి(07489/07490) ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది ఈ స్పెషల్ ట్రైన్. ఇక ఇదే రైలు తిరిగి 30వ తేదీ రాత్రి 8.25 గంటలకు స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది. మరో స్పెషల్ ట్రైన్ హైదరాబాద్-తిరుపతి(07449-07450) రైలు హైదరాబాద్ నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6.10 కి స్టార్ట్ అయ్యి.. మరుసటి రోజు మార్నింగ్ 6.45కి తిరుపతి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ట్రైన్ మళ్లీ తిరిగి తిరుపతి నుంచి 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.30కి హైదరాబాద్ చేరుకుంటుంది.

ఇక ఈ రెండు ట్రైన్లతో పాటుగా మరో స్పెషల్ ట్రైన్ కూడా ప్రయాణీకులను అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ టు కాకినాడ(07451-07452) ప్రత్యేక రైలు ఈనెల 29న రాత్రి 8.30 గంటలకు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మార్నింగ్ 8 గంటల సమయానికి కాకినాడ చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ తిరిగి 30వ తేదీ రాత్రి 9గంటలకు ప్రారంభం అయ్యి.. తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. దీంతో ప్రయాణీకుల రద్దీని నివారించగలుగుతామని రైల్వే అధికారులు తెలిపారు. అదీకాక ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ ను బట్టి ట్రైన్ ర్వీసులను పొడిగిస్తామని వారు పేర్కొన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ ఊరట లభిస్తుందనే చెప్పాలి. మరి దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక ట్రైన్లను వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.