Keerthi
Indian Railway: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు, సాంకేతిక లోపలు వంటి కారణలవల్ల రైల్వేశాఖ తరుచు పలు రైళ్లను రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచడం వంటి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఏకంగా 29 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Indian Railway: గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు, సాంకేతిక లోపలు వంటి కారణలవల్ల రైల్వేశాఖ తరుచు పలు రైళ్లను రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచడం వంటి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఏకంగా 29 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Keerthi
దేశంలో అతిపెద్ద రవాణ వ్యవస్థలో రైల్వే వ్యవస్థ కూడా ఒకటి. ఇక్కడ నిత్యం లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. పైగా ఈ ట్రైన్ జర్నీ అనేది టికెట్ ధర కూడా తక్కువగా ఉంటుంది. పైగా సురక్షితమైనది కావునా.. అందరూ ఈ ప్రయాణానికే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే.. సామన్యుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు నిత్యం ఈ రైళ్లు ప్రయాణం కొనసాగిస్తుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో మాత్రం తరుచు రైల్వే వ్యవస్థకు సంబంధించి ఏదో ఒక బిగ్ అలర్ట్స్ వినిపిస్తునే ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో రైళ్లు ప్రమాదాలు , రైళ్లు క్యాన్సిల్ అవ్వడం వంటి వార్తలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా దక్షిణ మధ్య రైల్వేశాఖ తాజగా ప్రయాణికులకు మరో బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు, సాంకేతిక లోపలు వంటి కారణలవల్ల రైల్వేశాఖ తరుచు పలు రైళ్లను రద్దు చేయడం, మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచడం వంటి చేస్తున్నారు. ఇక ఆ తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ విషయాలను తెలియజేస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా నేటి నుంచి మరో రెండు రోజుల్లో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్న ప్రయాణికులకుు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ను జారీ చేసింది. ఎందుకంటే.. నేడు (సోమవారం) 9,10,11 తేదీల్లో ఏకంగా 29 రైళ్లు సర్వీసులు అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలిపారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రద్దు చేసిన రైళ్ల జాబితాను కూడా పేర్కొన్నారు.
అయితే వాటిలో విజయవాడ–-బిట్రుగుంట, రాజమండ్రి-–విజయవాడ, విజయవాడ-–మచిలీపట్నం, మచిలీపట్నం–-గుడివాడ, విజయవాడ–-ఒంగోలు, విజయవాడ–-మచిలీపట్నం, విజయవాడ–-భీమవరంటౌన్, భీమవరంటౌన్–-నిడదవోలు, భీమవరంటౌన్–నర్సాపూర్, నర్సాపూర్–-విజయవాడ, గుంతకల్లు–-రాయ్‌చూర్, విజయవాడ-–రాజమండ్రి మార్గంలో నడిచే ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. ఈ తేదీల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి.. ప్రత్యామ్నాయం రవాణాను చూసుకోవాలని అధికారులు సూచించారు. మరీ, సాంకేతిక కారణవల్ల మూడు రోజుల పాటు 29 రైళ్లు రద్దు అయ్యాయని రైల్వేశాఖ తెలిపిన సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.