iDreamPost
android-app
ios-app

Zomato: రైల్వే ప్రయాణికులకు జొమాటో గుడ్ న్యూస్! ఇక మీ కోచ్ వద్దకే ఫుడ్ వచ్చేస్తుంది..

  • Published Sep 17, 2024 | 1:00 AM Updated Updated Sep 17, 2024 | 1:00 AM

Zomato: జొమాటోకి ప్రజాదారణ పెరుగిపోతుంది. నగరాల్లో నివసించే ప్రజలు జొమాటోని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Zomato: జొమాటోకి ప్రజాదారణ పెరుగిపోతుంది. నగరాల్లో నివసించే ప్రజలు జొమాటోని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Zomato: రైల్వే ప్రయాణికులకు జొమాటో గుడ్ న్యూస్! ఇక మీ కోచ్ వద్దకే  ఫుడ్ వచ్చేస్తుంది..

ఫేమస్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జొమాటోకి ప్రజాదారణ పెరుగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజలు జొమాటోని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అందుకు తగ్గట్లే జొమాటో కూడా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ విజయపథంలో దూసుకు వెళుతుంది. దీని వలన మనం తినాలనుకుంటున్న రుచికరమైన భోజనాన్ని మనకు నచ్చిన హోటల్ నుంచి క్షణాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటి దాకా సిటీలు, పట్టణాల్లో జొమాటో సేవలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలు చేరువయ్యాయి. ప్రస్తుతం జొమాటో సేవలు దేశంలోని రైల్వే స్టేషన్లకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా ఏకంగా వందకు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ను రైల్వే స్టేషన్ లో మన కోచ్ దగ్గరకు వచ్చి అందజేసే సేవ వచ్చింది. ఇది నిజంగా రైలు ప్రయాణికులకు బాగా ఉపయోగపడే సదుపాయం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ)తో కలిసి జొమాటో ఈ సేవలను అందిస్తుంది. ఈ విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే రైళ్లలో పది లక్షలకు పైగా ఆర్డర్లను ఇచ్చామని ఆయన తెలిపారు. రైలు ప్రయాణికులందరూ కూడా తమ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణీకులు ఈ సేవని వినియోగించుకోవచ్చు.

రైలు ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకోవాలంటే.. ముందుగా జొమాటో యాప్ ను ఓపెన్ చేయాలి.డెలివరీ సెర్చ్ బార్ లో మీరు ప్రయాణిస్తున్న రైలు పేరుని ఎంటర్ చెయ్యాలి. ఆ తరువాత “మీల్స్ ఎట్ ట్రైన్ సీట్ ‘ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. ఆ తరువాత పది అంకెల పీఎన్ ఆర్ నంబర్‌ను ఎంటర్ చెయ్యాలి. తరువాత మీరు ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్న స్టేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అందుబాటులో మీకు కనిపించే ఆప్షన్స్ నుండి రెస్టారెంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మెనూ కార్ట్‌లో మీకు కావాల్సిన ఫుడ్ ను ఎంటర్ చేయండి. కచ్చితంగా మీ రైలు కోచ్, సీట్ నంబర్ ను సరిగ్గా ఎంటర్ చేయాలి. అయితే ఇలా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు డెలివరీ తర్వాత పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక రైల్వే ప్రయాణికులకు జొమాటో అందిస్తున్న ఈ సర్వీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.