iDreamPost
android-app
ios-app

సంక్రాతికి ట్రైన్స్ అన్నీ ఫుల్! ఇంత ఫాస్ట్ గా ఉన్నారు ఏంటిరా బాబు?

  • Published Sep 14, 2024 | 2:22 PM Updated Updated Sep 14, 2024 | 2:40 PM

Indian Railway: సాధరణంగా సంక్రాతి పండుగకు ప్రతి ఏటా ముందాగానే రైల్వేశాఖ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సంక్రాతికి రిజర్వేషన్ కౌంటర్ ను రైల్వేశాఖ విడుదల చేశారు.

Indian Railway: సాధరణంగా సంక్రాతి పండుగకు ప్రతి ఏటా ముందాగానే రైల్వేశాఖ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సంక్రాతికి రిజర్వేషన్ కౌంటర్ ను రైల్వేశాఖ విడుదల చేశారు.

  • Published Sep 14, 2024 | 2:22 PMUpdated Sep 14, 2024 | 2:40 PM
సంక్రాతికి ట్రైన్స్  అన్నీ ఫుల్! ఇంత ఫాస్ట్ గా ఉన్నారు ఏంటిరా బాబు?

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న అతి పెద్ద పండుగ సంక్రాతి. ఈ పండుగ రాగనే పట్టణం నుంచి పల్లెకు పయనమైన ప్రజలు చాలామంది ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఉపాధి నిమిత్తం వలస వచ్చిన  ఉద్యోగులు,కార్మికులు ఇలా చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు.   ఈ క్రమంలోనే.. నెలల ముందు నుంచే ఈ పండుగకు బస్సులు, ట్రైన్స్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. పైగా ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ముందు నుంచే అలెర్ట్ అవుతారు.

ముఖ్యంగా ఈ పండుగ కోసం రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ల కౌంటర్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తారు. మరీ, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా .. సంక్రాతి పండుగకు రైల్వే శాఖ ముందుగానే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేసింది. అయితే వచ్చే ఏడాది సంక్రాతి పండుగకు ఎవరైనా సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటున్నారా? రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసకోండి.

సాధరణంగా సంక్రాతి పండుగకు ప్రతి ఏటా ముందాగానే రైల్వేశాఖ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. కానీ, ఆ రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేసేలోపే నిమిషాల వ్యవధిలో రైళ్ల సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ముఖ్యంగా ఆంధ్రవైపు వెళ్లే రైళ్లలో బుకింగ్ సీట్లన్నీ నిండిపోవడమో కాకుండా.. ఏ రైలుకు చూసిన వెయిటింగ్ లిస్టే ఎక్కువగా కనిపిస్తాది. తాజాగా ఈ సారి కూడా అదే జరిగింది. నిన్న శుక్రవారం ఉదయం 8 గంటలకు సంక్రాతి వెళ్లే రైళ్ల రిజర్వేషన్ కౌంటర్ ను విడుదల చేశారు. అయితే ఈసారి  ఇంక దసరా పండుగ కూడా రానే లేదు అప్పుడే సంక్రాతి పండుగకు రైళ్ల సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా సంక్రాతి పండుగకు మరో మూడు నెలలు సమయం ఉంది.

కానీ, అంతలోనే ముఖ్యమైన రైళ్లలో బెర్తులు అన్నీ అప్పుడే ఫుల్ అయిపోయాయి.  ముఖ్యంగా విశాఖ, గోదావరి, ఫలక్నుమా, కోణార్క్ తదితర రైళ్లకు 8.05 గంటలకల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయితే సంక్రాంతి పండుగకు ఇంక నాలుగు నెలల సమయం ఉన్నప్పటికే ట్రైన్ రిజర్వేషన్లలన్నీ ఇలా ఫుల్ అయిపోయే పరిస్థితి ఏర్పడిదంటే.. ఏ స్థాయిలో ట్రైన్లకు డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా రైళ్ల సీట్లన్నీ ఫుల్ అయిపోవడంతో ఇప్పటి నుంచే ప్రయాణికులు  ఎలా సొంతూళ్లకు వెళ్లలో అనే ఆలోచనలో పడ్డారు.