Vinay Kola
Telangana: హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో జరిగిన ఓ ఘటన షాకింగ్ కి గురి చేస్తుంది. ఓ హోటలో తల్లి,తండ్రి ఇంకా కొడుకు ఆత్మహత్యకి ప్రయత్నించారు
Telangana: హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో జరిగిన ఓ ఘటన షాకింగ్ కి గురి చేస్తుంది. ఓ హోటలో తల్లి,తండ్రి ఇంకా కొడుకు ఆత్మహత్యకి ప్రయత్నించారు
Vinay Kola
హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ షాకింగ్ కి గురి చేస్తుంది. ఓ హోటలో తల్లి,తండ్రి, కొడుకు ఆత్మహత్యకి ప్రయత్నించారు. ఇంతకీ వారు ఎవరు? ఎందుకు చనిపోవాలని ప్రయత్నించారు? వారికి వచ్చిన కష్టం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు భర్త, అత్త మామలా వేధింపులు తట్టుకోలేక కోడళ్ళు అఘాయిత్యాలు చేసుకునేవాళ్ళు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. వీటి మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ తాజాగా జరిగిన ఇన్సిడెంట్ మాత్రం టోటల్ గా డిఫరెంట్. ఈసారి కోడలు షాక్ ఇచ్చింది. తన భర్త, అత్త మామలకు సినిమా చూపించింది. బాగా వేధించింది. తన వేధింపులకు అత్తింటి వాళ్ళు బాబోయ్ అనుకున్నారో ఏమో.. చివరికి చేసేది లేక ఆత్మ హత్యకి పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారు. తండ్రి నారాయణ, తల్లి పద్మావతి, కుమారుడు సృజన్. వీరు ముగ్గురు కలిసి తాజ్ త్రీస్టార్ హోటల్‌లో నిన్న రాత్రి దిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హోటల్‌లోని మూడవ అంతస్తులో రూం నెంబర్ 308 ని బుక్ చేసుకున్నారు. కూల్ డ్రింక్‌లో విషం కలుపుకొని తాగారు. తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సర్విస్ కోసం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపు ఎంత కొట్టిన తీయలేదు. దాంతో వారి దగ్గర ఉన్న సర్విస్ కీ సహాయంతో డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగా మంచం మీద ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వాళ్ళని చూసి షాక్ అయ్యారు సిబ్బంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పాట్ కి చేరుకున్నారు పోలీసులు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
నారాయణ, పద్మావతి ఈ ఏడాది ఫిబ్రవరి 14న తమ కొడుకు సృజన్‌కు కావ్య అనే యువతితో పెళ్లి చేశారు. అయితే కొద్ది రోజులు వీరి జీవితం సాఫీగానే సాగింది. ఆ తరువాత వీరి జీవితంలో అభిప్రాయ బేధాలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు జరిగాయి. దీంతో ఈ గొడవలు తట్టుకోలేకపోయింది కోడలు కావ్య. ఇక వెంటనే భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు యాక్షన్ లోకి దిగారు. సృజన్‌పై 498 A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరు కూడా కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా తాను తగ్గలేదు. పట్టు వీడలేదు. బాగా వేధించింది. అత్తింటి వారికి కునుకు లేకుండా చేసింది. వారి పరువు పోగొట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నారాయణ, పద్మావతి, సృజన్ సికింద్రాబాద్ చేరుకున్నారు. తాజ్ త్రి స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. తరువాత ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసారు. తాము ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. దాంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగారు. అలా అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వెంటనే వీరిని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఇదీ సంగతి. కోడలు వేధింపులు, అవమానం తట్టుకోలేక అత్తింటి కుటుంబం ఇలా ఆత్మ హత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.