Hyderabad: ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఇష్టంగా సాస్‌లు తింటున్నారా? అంతా కల్తీరా బాబు!

వాతావరణంతో పాటు ఇప్పుడు తినే ఆహారపదార్ధాలు కూడా ఏ రకంగా కల్తీ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము. కేంద్రం ఇప్పుడిపుడే ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్ధాలను బ్యాన్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా శంషాబాద్ పోలీసులు నకిలీ ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వీరు విక్రయించే ఆహార పదార్ధాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

వాతావరణంతో పాటు ఇప్పుడు తినే ఆహారపదార్ధాలు కూడా ఏ రకంగా కల్తీ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము. కేంద్రం ఇప్పుడిపుడే ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్ధాలను బ్యాన్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా శంషాబాద్ పోలీసులు నకిలీ ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వీరు విక్రయించే ఆహార పదార్ధాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ప్రస్తుతం తినే ఆహరం నుంచి వాడుకునే వస్తువుల వరకు ప్రతిది కల్తీ అవుతోందన్న విషయం.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తినే ఆహార పాదార్దాలు ఎక్కువ శాతం కల్తీకి గురవుతూ ఉంటాయి. చిన్న పిల్లలు తినే చాక్లేట్లు, పీచు మిఠాయిలు ఇలా అన్నీ కల్తీ అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్ధాలను ప్రభుత్వం బ్యాన్ చేసిన న్యూస్ గురించి విన్నాము. అలాగే, నకిలీ అల్లం పేస్టును విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన న్యూస్ గురించి కూడా విన్నాము . ఈ క్రమంలో ఇప్పుడు కల్తీ సాస్ లు కూడా ఈ జాబితాలో చేరాయి. తాజాగా.. నకిలీ సాస్ లను తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాను.. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. నకిలీ సాస్ లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ లో శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పేరుతో.. ఓ ఫ్యాక్టరీ రన్ అవుతోంది. ఈ ఫ్యాక్టరీలో నకిలీ సాస్ లు తయారు చేస్తున్నారని గుర్తించని పోలీసులు.. ఫ్యాక్టరీపై దాడులు జరిపారు. ఈ క్రమంలో ప్రాణాలకు హాని కలిగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ ను ఉపయోగించి.. తయారు చేస్తున్న సాస్ లను సీజ్ చేశారు. పైగా, ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ తో ఉన్న పాకెట్స్ పై.. కొత్త డేట్స్ ను ప్రింట్ చేసి.. మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో మొత్తంగా మెుత్తంగా 772.13 లీటర్ల సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 13 కేజీల కార్న్ ఫ్లోర్ సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 3.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు.

అయితే, ఈ సాస్ లను ఎసిటిక్ యాసిడ్ తో తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కాగా, వాటితో తయారు చేసిన ఆహార పదార్దాలను తినడం వలన.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని.. నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని అన్ని ఆహార పదార్ధాలను, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తే మాత్రం.. అవి ఆరోగ్యంపై ప్రభావం చూపించడం ఖాయం అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిదని హెచ్చరిస్తున్నారు. మరి, నకిలీ సాస్ లను విక్రయిస్తున్న ముఠాను .. శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన.. ఘటన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments