iDreamPost

ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో ఐరన్ పిన్స్

  • Published Jun 29, 2024 | 6:17 PMUpdated Jun 29, 2024 | 6:17 PM

గత కొద్ది రోజులుగా నగరంలోని ప్రముఖ స్టార్ హోటల్స్ లో నాణ్యత లేని ఫుడ్ ను విక్రయిస్తుండటంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సరే ఆయా రెస్టారెంట్స్ సిబ్బంది ఏమాత్రం భయం లేకుండా తమ వైఖరిని మార్చుకోకుండా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా అందుకు తగ్గట్టు నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఓ కస్టమర్ కు బిర్యానీ ఆర్టర్ చేయగా అందులో మహిళలు వినియోగించే వస్తువు దర్శనమిచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

గత నెలరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్,స్టార్ హోటల్స్, అంటూ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్న చిన్న రెస్టారెంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు కల్తి ఫుడ్ ను విక్రయించి ప్రజల ప్రాణాలతో అడుకుంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుల్లిపోయిన చికెన్, బూజి పట్టిన వంట పాత్రలు, గడువు తీరిన ఆహార పదార్థలను వినియోగించడం వంటి ఘోరాలు బయటకు వస్తున్నాయి. దీంతో ప్రజలు బయట ఫుడ్ తినాలంటనే భయపడే పరిస్థితి ఏర్పాడుతుంది.  ఇదిలా ఉంటే.. ఓ పక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సోదాలు నిర్వాహిస్తున్న పలు రెస్టారెంట్స్ లో మాత్రం అసలు ఏమాత్రం భయం లేకుండా అదే తీరులో ప్రవరిస్తూ నాణ్యతలేని ఫుడ్ ను విక్రయిస్తున్నారు. తాజాగా అందుకు తగ్గట్టు నగరంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఓ కస్టమర్ కు బిర్యానీ ఆర్టర్ చేయగా అందులో సేఫ్టీ పిన్ ను దర్శనమిచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని మణికొంలో మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇక ఆ బిర్యానీ తిందమని చూడగా ఆ కస్టమర్ కు బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను దర్శనమిచ్చింది. ఇక అందుకు సంబంధించిన ఫోటో  కస్టమర్ నేడు అనగా జూన్ 29,2024, శనివారం సోషల్ మీడియా ఖాతలో పోస్ట్ చేశాడు. అలాగే ఆ పోస్ట్ కు ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు. అయితే ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ పై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తన వాట్సాప్‌లో జీహెచ్‌ఎంసీని ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు వివరాలు పంపాలని కోరారు. దీంతో కస్టమర్ స్పందిస్తూ ఇంత తొందరగా స్పందించినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటి నుంచి ఇతర కస్టమర్లుకు ఇలాంటి పొరపాట్లు జరగదని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఆ రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోమని ఆ కస్టమర్ అధికారులను కోరాడు.

అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా మెహ్‌ఫిల్ కూకట్‌పల్లి ఏరియా బ్రాంచ్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో పురుగు రావడంతో కస్టమర్ షాక్ గురైన విషయం తెలిసిందే. అయిన రెస్టారెంట్స్ వారు తమ వైఖరిని మార్చుకోకుండా ఇలా నాణ్యత లేని ఫుడ్ ను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని నెటిజన్స్  మండిపడుతున్నారు. అంతేకాకుండా అధికారులు ఆ రెస్టారెంట్ పై నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, బిర్యానీలో సెఫ్టీ పిన్ వచ్చిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి