భారీ వరదలు.. గాల్లో తేలియాడుతున్న రైల్వే ట్రాక్‌! ఆ రూట్‌లో రైళ్లు రద్దు

Heavy Rain, Railway Track, Kesamudram, Mahabubabad District: భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌ పూర్తిగా ధ్వంసమైన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దాంతో చాలా రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Heavy Rain, Railway Track, Kesamudram, Mahabubabad District: భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌ పూర్తిగా ధ్వంసమైన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. దాంతో చాలా రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. పలు చోట్ల వరద బీభత్సానికి రైల్వే ట్రాక్స్‌ కూడా భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలంలోని తాల్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కింద మట్టి మొత్తం కొట్టుకొని పోవడంతో.. రైల్వే ట్రాక్‌ గాల్లో తేలియాడింది. దీంతో.. ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరంగల్‌, ఖమ్మం మార్గాన్ని పూర్తిగా బంద్‌ చేసి.. ఆ రూట్స్‌లో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేసి.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు రైల్వే అధికారులు. రైల్వే ట్రాక్‌ ధ్వంసంతో ఉదయం 4.30 నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్‌లో నిలిపివేశారు. స్టేషన్‌లోనే ఉన్న ప్రయాణికులకు మహబూబాబాద్‌ పోలీసులు భోజన ఏర్పాట్లు చేశారు.

రైల్వే ట్రాక్స్‌ దగ్గర్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండిపోయి.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. మహబూబాబాద్‌, ఖమ్మం రైల్వే స్టేషన్స్‌లో నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులను తరలించేందుకు రైల్వే అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్‌లో రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో.. నిత్యం రద్దీగా ఉంటే సికింద్రాబాద్‌-విజయవాడు రైల్వే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయి.. ఖమ్మం​, వరంగల్‌, మహబూబాబాబ్‌, కాజీపేట్‌ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లలో చిక్కుకున్న వారి బాధలు వర్ణణాతీతం.

Show comments