iDreamPost
android-app
ios-app

నాని హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం! ఏం జరిగిందంటే?

  • Published Oct 03, 2024 | 4:50 PM Updated Updated Oct 03, 2024 | 4:50 PM

Heroine Priyanka Mohan: సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటే వారికి లభించే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతమంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా షాపింగ్ మాల్స్, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతూ బాగానే సంపాదిస్తున్నారు.

Heroine Priyanka Mohan: సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్లు వరుస విజయాలు అందుకుంటే వారికి లభించే క్రేజ్ అంతా ఇంతా కాదు. కొంతమంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా షాపింగ్ మాల్స్, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవుతూ బాగానే సంపాదిస్తున్నారు.

  • Published Oct 03, 2024 | 4:50 PMUpdated Oct 03, 2024 | 4:50 PM
నాని హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌కు పెను ప్రమాదం! ఏం జరిగిందంటే?

ప్రముఖ దర్శకులు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీకి మంచి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించి అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్ కి మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ ‘సరిపోదా శనివారం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.  తాజాగా ప్రియాంక మోహన్ కి పెను ప్రమాదం తప్పిపోయింది. కాస్త అలర్ట్‌ గా లేకపోతే.. ప్రాణాలు దక్కేవి కాదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంతకీ ఆమెకు ఏం ప్రమాదం జరిగింది.. ఎలా ప్రమాదం నుంచి బయటపడ్డారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ‘సరిపోదా శనివారం’మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. స్టేజ్ పైకి ఎక్కిన ప్రియాంక అభిమానులకు అభివందనం చేస్తున్న సమయంలో వేదిక ఒక్కసారే కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ పై ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోవడంతో గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి హీరోయిన్ ప్రియాంక సురక్షితంగా బయటపడ్డారు. కాకపోతే ఎమ్మెల్యే యశస్విని అత్తమ్మ.. పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సిరెడ్డి కాలు విరిగింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కి తరలించారు.

షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్ పై ఆమె అభివాదం చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వేదికపైకి ఎక్కడంతో కుప్పకూలినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే షాపింగ్ మాల్ లోకి తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రియాంక మోహన్. ఆ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన మూవీ ‘వరుణ్ డాక్టర్’లో నటించింది. డబ్బింగ్ మూవీ అయినా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హారోయిన్ గా నటించింది. ఇటీవల నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom