Arjun Suravaram
South Central Railway In AP, TG: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రద్దైన రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. మరి.. ఈ వివరాల్లోకి వెళ్తే...
South Central Railway In AP, TG: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల రద్దైన రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. మరి.. ఈ వివరాల్లోకి వెళ్తే...
Arjun Suravaram
మూడు రోజులుగా కురిసిన వానలకు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల వణికిపోయాయి. భారీ వరదల ధాటికి తెలంగాణలోని ఖమ్మ, వరంగల్ జిల్లాలు, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎంతో మంది తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక అల్లాడిపోయారు. ఇది ఇలా ఉంటే..భారీ వరదల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు, రైళ్ల మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. అయితే తాజాగా రైల్వే ప్రయాణికులు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
గత మూడు రోజులుగా కురిసిన వానలకు మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మడంలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసింది. ఆ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసంమైంది. కేవలం గాల్లో వేలాడుతూ..రైల్వే ట్రాక్ ఉంది. ఇది గమనించిన..అక్కడి రైల్వే లైన్ మేన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇక ఇంటికన్నె సమీపంలో రైల్వేట్రాక్ దెబ్బతిన్న నేపథ్యంలో మార్గంలో తిరిగి రైళ్లను రద్దు చేశారు. అంతేకాక తెలంగాణ , ఏపీ మధ్య నడిచే రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వెంటనే రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. మూడు రోజుల పాటు రేయిబవళ్లు శ్రమించి ట్రాక్‌ను తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు.
ఇక రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి కావడంతో కొబ్బరికాయ కొట్టి..బుధవారం అనగా సెప్టెంబర్ 4వ తేదీన అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. వరద ప్రభావంతో మొన్న కేసముద్రం సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ నిలిచిపోయిన సంగతి తెలిసింది. ఆ ఎక్స్ ప్రెస్ ట్రైన్ తో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ రోజు సాయంత్రం నుండి పూర్తిస్థాయిలో యధావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాకపోతే, రైల్వే ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతంలో రైళ్ల వేగం తగ్గించనున్నట్లు సమాచారం. మొత్తంగా గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రద్దైన పలు రైళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక రైళ్ల ప్రయాణంకి సిద్దమయ్యే వాళ్లు..సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ లో చూసి.. ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. మరి.. రైల్వే శాఖ ఇంత త్వరితగతిన చర్యలు తీసుకుని ట్రాక్ ను పునరుద్దరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Restoration works in full swing by SCR where breaches occurred due to heavy rains. All efforts are being taken up for restoration of train services in the Grand Trunk route section connecting North and South.@drmsecunderabad@drmvijayawada pic.twitter.com/1hwqwbv5UW
— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024