iDreamPost
android-app
ios-app

హైదరబాద్ లో కొత్త రైల్వే స్టేషన్.. ఏకంగా ఎయిర్ పోర్ట్ రేంజ్ లో!

  • Published Mar 19, 2024 | 11:19 AM Updated Updated Mar 19, 2024 | 11:19 AM

రైలు ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఎయిర్ పోర్టును మించి ఆధునిక వసతులతో కొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది.

రైలు ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఎయిర్ పోర్టును మించి ఆధునిక వసతులతో కొత్త రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది.

హైదరబాద్ లో కొత్త రైల్వే స్టేషన్.. ఏకంగా ఎయిర్ పోర్ట్ రేంజ్ లో!

ఆసియాలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన మనదేశంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండడం.. సమయం ఆదా అవడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపిస్తుంటారు. ఇక పండగల సీజన్లలో ప్రతి ట్రైన్ కిక్కిరిసిపోతుంటుంది. రైల్వే స్టేషన్లన్ని రద్దీగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలో హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నగరంలో ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ఉండగా మరో కొత్త రైల్వే స్టేషన్ ను నిర్మించనున్నారు.

జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించి, హైదరాబాద్ లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గించేందుకు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ. నగర శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు రైల్వే అధికారులు. ఆధునిక వసతులతో ఎయిర్ పోర్టును తలదన్నేల చర్లపల్లి రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ రెడీ అవుతోంది.

అప్ గ్రేడ్ చేస్తున్న చర్లపల్లి స్టేషన్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండనుంది. ట్రైన్ల ఆలస్యానికి చెక్ పెట్టడంతో పాటు.. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులు మెయిన్ సిటీలోకి రాకుండానే చర్లపల్లి స్టేషన్ నుంచే ట్రైన్ ఎక్కే సౌకర్యం కలుగుతుందని దక్షిణ మద్య రైల్వే అధికారులు తెలిపారు.

కాగా చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇప్పటికే మూడు జతల ట్రైన్లను నిలుపుతున్నారు. ఈ స్టేషన్లో మరికొన్ని రైళ్లను ఆపడమే కాకుండా ఇక్కడి నుంచే రైళ్లు బయలుదేరేలా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య రెండో లైను అందుబాటులోకి రావడంతో నగరం మీదుగా వెళ్తున్న ట్రైన్లను బైపాస్‌ చేయడానికి ఈ స్టేషన్‌తో వీలు కలుగనున్నది. కాగా ఈ స్టేషన్లో ఇదివరకు రెండు ప్లాట్‌ఫామ్‌లు, మూడు రైల్వే లైన్లుగా ఉండగా.. ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 24 బోగీలు పట్టేలా 5 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రాగా.. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా రూ.430 కోట్ల అంచనా వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ నిర్మిస్తున్నారు అధికారులు.