iDreamPost
android-app
ios-app

గోవాకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇక నుంచి..

గోవాలోని పర్యాక ప్రదేశాలు చూసేందుకు వేలాది మంది అక్కడికి వెళ్తుంటారు. ఈక్రమంలో గోవాకు వెళ్లే వారికి శుభవార్త అందించింది రైల్వే శాఖ. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటంటే?

గోవాలోని పర్యాక ప్రదేశాలు చూసేందుకు వేలాది మంది అక్కడికి వెళ్తుంటారు. ఈక్రమంలో గోవాకు వెళ్లే వారికి శుభవార్త అందించింది రైల్వే శాఖ. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటంటే?

గోవాకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇక నుంచి..

గోవా.. పర్యాటక ప్రాంతానికి పెట్టింది పేరు. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. స్వదేశీయులే కాదు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు గోవాను విజిట్ చేస్తుంటారు. యూత్ ఎక్కువగా గోవాకు వెళ్లేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. గోవాలోని బీచ్ లు, ప్రత్యేక కట్టడాలు, విశిష్టమైన వన సంపద పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. మరి మీరు కూడా గోవాకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గోవాకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రైల్వే శాఖ నిర్ణయంతో గోవా ప్రయాణం సులభం కానున్నది.

గోవాకు వెళ్లేవారి ప్రయాణ కష్టాలను తీర్చేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది. ఈ రైళ్లు వారానికి రెండుసార్లు నడవనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బుధ, శుక్రవారం కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ( 17039 / 17040 ) నడువనున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు. వాస్కోడగామా నుంచి గురు, శనివారం తిరిగి బయలుదేరుతాయని తెలిపారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో మీదుగా వాస్కోడగామా చేరుకుంటుందని ఆయన వివరించారు.

సికింద్రాబాద్ -గోవా మధ్య నడిచే రైళ్లు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే గతంలో వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో బయలుదేరి గుంతకల్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుపతి నుంచి మరో 10 కోచ్‌లతో గోవాకు వెళ్లేదని తెలిపారు. ఇదేకాకుండా కాచిగూడ- యలహంక మధ్యన వారానికి నాలుగురోజులు ప్రయాణం చేసే రైలుకు గోవాకువెళ్లే 4 కోచ్‌లను కలిపేవారని తెలిపారు. కొత్త ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభమవనుండడంతో గోవాకు వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.