iDreamPost
android-app
ios-app

రాష్ డ్రైవింగ్ కేసు.. దుబాయ్ పారిపోయిన BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు

  • Published Dec 27, 2023 | 12:30 PM Updated Updated Dec 27, 2023 | 12:30 PM

బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కొడుకు పరారీలో ఉన్నాడు. ఆ వివరాలు..

బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కొడుకు పరారీలో ఉన్నాడు. ఆ వివరాలు..

  • Published Dec 27, 2023 | 12:30 PMUpdated Dec 27, 2023 | 12:30 PM
రాష్ డ్రైవింగ్ కేసు.. దుబాయ్ పారిపోయిన BRS మాజీ ఎమ్మెల్యే కొడుకు

ప్రజా భవన్ వద్ద ఈ నెల 24 అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను కారుతో ఢీకొట్టాడు. ప్రమాదాన్ని గమనించిన అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు సోహైల్ ని అదుపులోకి తీసుకుని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అతడి అనుచరులు.. సోహైల్‌ను తప్పించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో.. షకీల్ ఇంట్లో పని చేస్తున్న డ్రైవర్‌‌ను నిందితునిగా పేర్కొంటూ.. అతని పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఇందుకు డ్యూటీలో ఉన్న సీఐ దుర్గారావు సహకరించారు. దాంతో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ దుర్గరావును సస్పెండ్ చేశారు ఉన్నాతాధికారులు. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Son of former BRS MLA absconding

ప్రమాదం తర్వాత తన స్థానంలో కారు డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పడమే కాక.. అతడిని స్టేషన్ కి పంపించాడు సోహైల్. ఆ తర్వాత అతడు నేరుగా ముంబై వెళ్లి.. అక్కడ నుంచి దుబాయ్ కి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు.. సోహైల్ మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ లో ఉన్న అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పోలీసులు.

ఈ యాక్సిడెంట్ వ్యవహారంపై రాజకీయపరంగా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు రావటంతో అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. దాంతో పోలీసుల నిర్వాకం బయటపడింది. ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గరావు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. సోహైల్‌ను తప్పించే ప్రయత్నం చేశాడని దర్యాప్తులో వెల్లడయ్యింది. దాంతో.. దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మరోవైపు.. ఈ కేసులో సోహైల్‌ను ఏ1 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండటంతోఅతడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంత వరకు స్పందించలేదు.