Arjun Suravaram
High Speed Rail Hyderabad: లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఓ శుభవార్త చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తెలంగాణ గురించి, అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
High Speed Rail Hyderabad: లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఓ శుభవార్త చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తెలంగాణ గురించి, అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
Arjun Suravaram
తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారత దేశానికే ప్రధానమైన నగరం…హైదరాబాద్. ఇక్కడకి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి..జీవనోపాధి పోందుతున్నారు. అలానే ఈ నగరం ఐటీ కారిడార్ కి ప్రసిద్ది చెందింది. ఇటీవలే ఈ ప్రాంతం మీదుగా వందే భారత్ రైలు నడుస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానిక హైస్పీడ్ రైలు కారిడార్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హైదారాబాద్ గురించి ప్రత్యేకంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైస్పీడ్ రైల్ కారిడార్ లో భవిష్యత్తులో హైదరాబాద్ కూడా భాగం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణకే కాక భారత్ కూడా హైదరాబాద్ ఓ అభివృద్ధి కేంద్రం. ఆ సిటీని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లకు అనుసంధానం చేయాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా కేంద్రం పని చేస్తోంది. ఇక వందే మెట్రో రైలు ప్రయోజనాలరు కూడా హైదరాబాద్ పొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన అనేక అంశాల గురించి ప్రస్తావించారు.
ప్రభుత్వాలపై ప్రజల్లో నమ్మకం అడుగంటిన పరిస్థితుల్లో అధికార పగ్గాలు నేను భారత్ ను ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడగలమన్న స్థాయికి తీసుకెళ్లగలిగా. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ఏపీ విభజన చట్టంలోని నిబంధనలు అమలు దిశగా పదేళ్లుగా పని చేశాం. ఏకాభిప్రాయ సాధన ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక తెలంగాణ విషయంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పసుపు బోర్డు పనులు ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వ కఠోర శ్రమ, ట్రాక్ రికార్డును దేశ ప్రజ్లు చూశారని, దశాబ్ద కాలంలో దేశాన్ని ఎలా రూపాంతరం చెందించామన్నది గుర్తించారని ఆయన తెలిపారు.
2047 నాటికి వికాసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా తాము దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రజలు నమ్ముతున్నారని మోదీ తెలిపారు. మొత్తంగా ప్రధాని మోదీ..హైదరాబాద్ కు హైస్పీడ్ రైలు ప్రకటన చేయడంపై తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మోజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. మరి..హైదరాబాద్ కు హై స్పీడ్ రైలు విషయంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.