iDreamPost
android-app
ios-app

ఆ కంపెనీ మెడిసిన్ వాడొద్దు! అంతా నకిలీ! అధికారులు ఆదేశాలు!

ఇన్నాళ్లు పాలు, నూనె, మసాలాలు, ఐస్ క్రీమ్స్ మాత్రమే ఫేక్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ.., ఇప్పుడు కేటుగాళ్ళు మెడిసిన్స్ కూడా నకిలీవి సృష్టించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

ఇన్నాళ్లు పాలు, నూనె, మసాలాలు, ఐస్ క్రీమ్స్ మాత్రమే ఫేక్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ.., ఇప్పుడు కేటుగాళ్ళు మెడిసిన్స్ కూడా నకిలీవి సృష్టించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

ఆ కంపెనీ మెడిసిన్ వాడొద్దు! అంతా నకిలీ! అధికారులు ఆదేశాలు!

“అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల.. కాదేది కవితలు అనర్హం” అన్నాడు శ్రీశ్రీ. కానీ.., నేటి కాలంలో కేటుగాళ్లు కొత్త బాట పట్టాడు. అసలే కల్తీ ఆహారాలు తిని అనారోగ్యం పాలు అవుతుంటే, ఆరోగ్యాన్ని కాపాడే మెడిసిన్ కూడా కల్తీ చేస్తూ.., కాదేది కల్తీకి అనర్హం అనే కొత్త నానుడి పుట్టిస్తున్నారు. చదువుతుంటేనే చేతులు, కాళ్ళు వణికిపోతున్నాయి కదా? ఇది అక్షరాల నిజం. ప్రస్తుతం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కల్తీ మెడిసిన్ బాహాటంగా అమ్మేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలు ఎక్కువ కావడంతో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో ఫోకస్ పెంచి, రైడ్స్ పెంచింది. దీంతో ఊహకి కూడా అందని నకిలీ గాళ్ళ లీలలు బయట పడుతున్నాయి. ఇది చూసి అధికారులు సైతం బిత్తరపోతున్నారు. ఇన్ని రోజులు పేషంట్స్ ఈ ఫేక్ మెడిసిన్ వాడారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

కొన్నిరోజులు క్రితం హైదరాబాద్ లోని మలక్‌పేట్‌లో ఉన్న మెడిసిన్ షాప్ లో పోలీసులు దాడి చేశారు. ఆ సోదాల్లో ‘ఎంపీఓడీ-200’ పేరుతో యాంటీబయాటిక్ అని తప్పుగా ముద్రించిన మాత్రలు దొరికాయి. ఇలాంటివి నకిలీవి మొత్తం రూ.7.34 లక్షలు టాబ్లెట్‌లు దొరికాయి. “ఆపరేషన్ జై” పేరుతో జరిగిన అంతర్-రాష్ట్ర ఆపరేషన్ లో తీగ లాగితే డొంక అంతా కదిలింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ముఠా మెగ్ లైఫ్‌సైన్సెస్ పేరుతో మందులు తయారు చేసి, మార్కెట్ లోకి వదులుతున్న విషయం పోలీసులకి అర్థమైంది. మెగ్ లైఫ్‌సైన్సెస్ అనే పేరు వినడానికి సరిగ్గా.. మెడికల్ టర్మ్ లా అనిపించడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. అయితే.., నిజానికి ఆ పేరుతో అసలు ఎలాంటి కంపెనీ రిజిస్టర్ అయ్యి లేదు. దీంతో.. మొత్తం రూ. 33.35 లక్షల విలువైన నకిలీ మందులను డీసీఏ సీజ్ చేసింది.

ఈ ముఠా చాక్ పౌడర్, గంజిని ఉపయోగించి మందులు తయారు చేస్తోంది. వీటిని అతి జాగ్రత్తగా మార్కెట్ చేస్తున్నారు. ఫార్మసీ డీలర్స్ కి ఈ మందులను అతి చౌకగా ఇస్తున్నారు. అయితే.., ఇవి నకిలీ మందులు అని తెలియని డీలర్స్ వీటిని ఆస్పత్రులకు, రిటైల్ షాప్స్ కి పంపిణీ చేస్తున్నారు. అలా.. ప్రజల చేతుల్లోకి ఈ నకిలీ మందులు వస్తున్నాయి. వాడింది చాక్ పౌడర్, గంజి కాబట్టి.. ఈ ఈ మందుల్లో ఎలాంటి మెడిసిన్ ఉండదు. మెగ్ లైఫ్‌సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడిసిన్స్ వాడొద్దని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ షాపుల నిర్వాహకులకు కూడా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచనలు చేసింది. ఇప్పటికే వీటి డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది. అయినా.., ఇలాంటి ఫేక్ మెడిసిన్స్ ఇంకెన్ని మార్కెట్ లో ఉన్నాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి.. మెడిసిన్ కూడా ఇలా కల్తీ చేసేవారికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.