Swetha
ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా తిరిగి వస్తే చాలు అనుకుంటున్నారు చాలా మంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది.
ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా తిరిగి వస్తే చాలు అనుకుంటున్నారు చాలా మంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది.
Swetha
తరచూ సమాజంలో జరిగే అఘాయిత్యాల గురించి నిత్యం వార్తల్లో వింటూనే ఉంటాం. ప్రపంచంలో రోజు పదుల సంఖ్యలో ఎదో ఒక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంది. అందులోను మరి ముఖ్యంగా ఈ మధ్య నగరంలో మిస్సింగ్ కేసులు ఎక్కువైపోయాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సేఫ్ గా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేకుండా పోతుంది. ఎప్పుడు ఏ వార్తను వినాల్సి వస్తుందా అని ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. ఇప్పటికి అంతు చిక్కని మిస్సింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
రాజ్ కుమార్, లావణ్య దంపతులు వారి పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని బాలానగర్ సమీపంలో .. ఫిరోజ్ గూడలో నివశిస్తున్నారు. అయితే, ఆమె భర్త, పిల్లలు సోమవారం రోజున ఆమెను వదిలేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వీరిని కలుద్దాం అనుకుని లావణ్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. కానీ, ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య వారి కుటుంబ సభ్యులను కలవలేదు. అలా అని తిరిగి ఇంటికి కూడా చేరుకోలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు లావణ్య కోసం గాలించగా.. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై పిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు లావణ్య కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఈ కేసు విషయమై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సీఐ కె. భాస్కర్ తెలిపారు.
ఏదేమైనా, ప్రస్తుతం ఇటువంటి దారుణాలు మన చుట్టూ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా దీని పట్ల జాగ్రత్త వహించాలి. ఇంటినుంచి మన కుటుంబ సభ్యులు బయటకు వెళ్తే.. వారు తిరిగి వచ్చే వరకు వారి గురించి ఆచూకీ తెలుసుకుంటూ ఉండడం మంచిది. ఇక ఈ కేసు విషయంలో లావణ్య ఎక్కడికి వెళ్ళింది, తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీనితో ఆమె భర్త, పిల్లలు లావణ్య కోసం తల్లడిల్లిపోతున్నారు. మరి, నగరంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.