iDreamPost
android-app
ios-app

వీడియో: హైదరాబాద్ అభివృద్ధికి YSR కారణం! నిజాలు ఒప్పుకున్న రేవంత్!

తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చర్చకు వచ్చే అంశం హైదరాబాద్ అభివృద్ధి. దీనిని ప్రధానంశంగా అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తుంటాయి.  హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామంటే తామేనని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. తాజాగా ఓ ప్రెస్ మీట్ ల్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ కీలక విషయాలు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ కారణమంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు.

తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చర్చకు వచ్చే అంశం హైదరాబాద్ అభివృద్ధి. దీనిని ప్రధానంశంగా అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తుంటాయి.  హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామంటే తామేనని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. తాజాగా ఓ ప్రెస్ మీట్ ల్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ కీలక విషయాలు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వైఎస్సార్ కారణమంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు.

వీడియో: హైదరాబాద్ అభివృద్ధికి YSR కారణం! నిజాలు ఒప్పుకున్న రేవంత్!

విశ్వనగరంగా హైదరాబాద్‌కి పేరు. కారణం.. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన నగరాల్లో ఒకటిగా ఈ సిటీ నిలిచింది. అయితే ఈ భాగ్యనగర అభివృద్ధిని  అన్ని పార్టీలు తమ ఖాతాలో వేసుకుంటాయి. ఈ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఎక్కడి వెళ్లినా, ఏ సభలో మాట్లాడినా.. హైదారాబాద్ కి టెక్నాలజీ పరిచయం చేసింది, నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనదేనని  ప్రచారం చేసుకుంటారు. అందుకు తగినట్లే ఎల్లో మీడియాలు సైతం బాబును ఆకాశానికి లేపుతాయనే టాక్ వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు  పరువును టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి తీశారు. హైదరాబాద్ లో ఐటీ పునాది వేసింది కాంగ్రెస్ చంద్రబాబు డబ్బా కొట్టుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ దే అని పరోక్షంగా చెప్పారు.

తెలంగాణలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ చర్చకు వచ్చే అంశం హైదరాబాద్ అభివృద్ధి. దీనిని ప్రధానంశంగా అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తుంటాయి.  హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామంటే తామేనని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. ముఖ్యంగా టీడీపీ అయితే ఈ  అంశంలో ఒక అడుగు ముందుకేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదారాబాద్ అభివృద్ది గురించి చెప్పుకునే గొప్పల  గురించి అందరికి తెలిసిందే. నగరానికి టెక్నాలజీని పరిచయం చేసింది, హైటెక్ సిటీని కట్టించింది, నగరాన్ని అభివృద్ధి చేసింది..తానే అంటూ ప్రతి సందర్భంల్లో చెప్పుకుంటారు.

అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీ మాజీ నేత, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి..చంద్రబాబు పరువు తీశారు. హైటెక్ సిటీ కట్టించి చంద్రబాబు కావొచ్చు కానీ.. దానికి పునాది వేసింది నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, టెక్నాలజీని పరిచయం చేసింది.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అని రేవంత్ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ కు టెక్నాలజీని పరిచయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును నిర్మించింది, మెట్రోను, ఐటీ కంపెనీలను,  ఫార్మా కంపెనీలను ప్రవేశ పెట్టింది, ఫ్లై ఓవర్లు నిర్మించింది కాంగ్రెసేనని రేవంత్ పేర్కొన్నారు. ఈ నగరంలో కోట్ల ఆదాయ సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నారు.

అయితే ఈ మాటలు ద్వారా పరోక్షంగా దివంగతనేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రశంసించారని పలువురు అంటున్నారు. కారణం.. రేవంత్ రెడ్డి చెప్పినవని వైఎస్సార్ హాయాంలోనే జరిగాయి. అలా తన మాజీ బాస్ పరువును రేవంత్ రెడ్డి తీసేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అంతేకాక ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పిన నిజాలు ఎక్కడికిపోవని, హైదరాబాద్ అభివృద్ధికి కారణం  వైఎస్సార్ అని అనేక మంది పేర్కొన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మాటలతో మరోసారి అది స్పష్టమైంది. మరి.. హైదరాబాద్ లో ఐటీ విషయంలో చంద్రబాబు డబ్బా కొట్టుకుంటే సరిపోదని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.