iDreamPost
android-app
ios-app

నగరవాసులకు గుడ్ న్యూస్.. డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీకి డేట్ ఫిక్స్!

  • Author singhj Published - 09:11 PM, Fri - 8 September 23
  • Author singhj Published - 09:11 PM, Fri - 8 September 23
నగరవాసులకు గుడ్ న్యూస్.. డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీకి డేట్ ఫిక్స్!

హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో రెండో విడత డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన రెండో దశలో దాదాపు మరో 13,300 ఇండ్లను పేదలకు అందజేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. డబుల్ బెడ్​రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై సచివాలయంలో మంత్రులు తలసాని, సబితా, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

డబుల్ బెడ్​రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అప్లయ్ చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను అందిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రీసెంట్​గా తొలి దశలో సిటీలో 11,700 ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని పేర్కొన్నారు. డబుల్ బెడ్​రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మీడియా ముందు అత్యంత పారద్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.

‘డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో అవకతవలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే. తప్పు చేసిన అధికారులను సర్కారు ఉద్యోగం నుంచి తీసివేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయి. హైదరాబాద్​లో గృహలక్ష్మీ స్కీమ్ కూడా త్వరలో మొదలవుతుంది. ఈ పథకానికి సంబంధించి హైదరాబాద్ సిటీ పరిధి వరకు కొన్ని మార్పులు చేయాలని మంత్రులు సీఎంను కోరారు. వాళ్లు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా అంగీకరించారు. హైదరాబాద్ సిటీలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్​రూమ్ ఇళ్లకు ప్రభుత్వానికి రూ.9,100 కోట్ల ఖర్చయింది. కానీ వీటి మార్కెట్ విలువ సుమారుగా రూ.50 వేల కోట్ల పైనే ఉంటుంది’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి