iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన కీలక పత్రాలు!

హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. కాగా ఈ ప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. కాగా ఈ ప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మీకోసం..

ప్రభుత్వ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన కీలక పత్రాలు!

ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. మానవ తప్పిదమో లేక ఇతర కారణాల వల్లనో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్ మెంట్స్ ఇలా పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాంపల్లిలో ఓ భవనంలో పేలుడుకు సంబంధించిన పదార్థాలు నిల్వ ఉంచడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కీలక పత్రాలు అగ్నికి ఆహూతయ్యాయని అధికారులు వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫీసులో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నగరంలోని హిమాయత్ నగర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ఘటన నిన్న శుక్రవారం జరిగిందని అధికారులు తెలిపారు. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో ఆఫీసులో ఉన్నటువంటి విలువైన పత్రాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌, కీలక ప్రాజెక్టులకు సంబంధించిన దస్త్రాలు కాలి బూడిదయ్యాయి. కిటికీ అద్దాలకు ఉండే ఫైబర్‌ బీడింగ్‌ మంటల ధాటికి మెత్తబడి.. కింద నిలిపి ఉంచిన కారుపై పడటంతో మంటలు వ్యాపించి అది కూడా కాలిపోయింది. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిపారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వ కార్యాలయంలో ప్రమాదం జరగడంతో పలు అనుమానాలకు తావిస్తుందని పలువురి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిందా.. లేదా ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే షార్ట్ సర్య్కూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చని ఆఫీస్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వాస్తవాలను వెలికి తీసేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దర్యాప్తు అనంతరం నిజనిజాలు బయటపడతాయని అధికారులు వెల్లడించారు. మరి ప్రభుత్వ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి