iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క తప్పు చేసి బుక్కయిన నిత్యపెళ్లి కొడుకు..!

  • Published Apr 24, 2024 | 12:02 PM Updated Updated Apr 24, 2024 | 12:02 PM

Hyderabad Crime News: ఇటీవల కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది నిత్య పెళ్లి కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Hyderabad Crime News: ఇటీవల కొంతమంది డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల మోసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది నిత్య పెళ్లి కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

  • Published Apr 24, 2024 | 12:02 PMUpdated Apr 24, 2024 | 12:02 PM
ఆ ఒక్క తప్పు చేసి బుక్కయిన నిత్యపెళ్లి కొడుకు..!

ఇటీవల తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు తెగబడుతున్నారు. ఎన్నో అక్రమ దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కొంతమంది ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకొని కట్నం తీసుకుంటూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. అలా ఓ నిత్య పెళ్లి కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరిని ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరంగల్ జిల్లా సుందరయ్య నగర్ కి చెందిన రాజేష్ హైదరాబాద్ లో కొంతకాలంగా కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి అమ్మాయిలపై మోజు ఉండే రాజేష్ పెళ్లి పేరుతో ఓ వైపు డబ్బు, అమ్మాయిల సుఖం రెండు దక్కుతాయని కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2022 హైదరాబాద్ చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇవ్వకుండానే 2022 న ఏపీకి చెందిన శ్రావణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లతో సంసారం చేస్తూనే సుందరయ్య నగర్ కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ లలోని ఆర్యసమాజ్ మందిరంలో మూడో పెళ్లలి చేసుకున్నాడు.

ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్న రాజేష్ కి మోజు ఇంకా తీరలేదు.. మరో అమ్మాయికి గాలం వేశాడు. కరుణ అనే యువతిని బుట్టలో వేసుకొని ఆమెతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరగడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సుందరయ్య నగర్ లో వీరిద్దరిని సారిక తల్లిదండ్రుల చూశారు. ఏం జరుగుతుందని అక్కడే నిలదీశారు. వాళ్లకు మాయ మాటలు చెప్పి అక్కడ నుంచి మెల్లిగా తప్పించుకున్నాడు. సారిక తల్లిదండ్రులు డయల్ 100 కి ఫోన్ చేయగా జారిగంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సారిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరికీ విడాకులు ఇవ్వకుండా నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న రాజేష్ ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.