Keerthi
Hyderabad: తాజాగా నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ అధికారి ఆధ్వర్యంలో.. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను ట్రాఫిక్ పోలీసు అధికారులు ఛలాన్లు విధిస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే..
Hyderabad: తాజాగా నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ అధికారి ఆధ్వర్యంలో.. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను ట్రాఫిక్ పోలీసు అధికారులు ఛలాన్లు విధిస్తున్నారు. ఇంతకీ ఎక్కడంటే..
Keerthi
నగరంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు ట్రాఫిక్ రూల్స్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి. అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి వాహనాదారుల భద్రత గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే కావచ్చు. కానీ, వాహనదారులు మాత్రం ఈ రూల్స్ తో అడుగు తీసి బయటకు వెళ్లలంటే భయపడుతున్నారు. ఎందుకంటే.. అడుగడుగున ట్రాఫిక్ పోలీసులు వాహనాదారులకు తనిఖీలు చేయడం, నిబంధనలు పాటించకపోతే జరిమానా తో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే రోజు రోజుకి అధికారులు ఈ రూల్స్ ను మరింత కఠినం చేస్తున్న సరే కొంతమంది వాహనాదారులు ఇంక నిర్లక్ష్యం వహిస్తునే ఉన్నారు. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడం, అతి వేగంగా వెళ్లడం వంటివి చేస్తున్నారు. పైగా ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారమో అని తెలివిగా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ కూడా సరిగా పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ అధికారి ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను తనీఖీ చేసిన అధికారులు భారీగా ఛలాన్లు విధించారు. ఇంతకీ ఎక్కడంటే..
తాజాగా నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలను ఛలాన్లు వేశారు. అంతేకాకుండా.. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస రావు, ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ లక్ష్మి మాధవి ఈ విషయంలో వాహనాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న తనిఖీలలో 95 ద్విచక్ర వాహనాలను, ఐదు కార్లకు నెంబర్ ప్లేట్లు సరిగా లేవని, అలాంటి వాహనాలకు ఛలానలు విధించినట్లు ఆయన తెలిపారు.
ఇకపోతే వాహనదారులు ప్రతి ఒక్కరు ఈ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని, ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన పత్రాలతో పాటు నెంబర్ ప్లేట్లు కూడా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా.. వాహనాలకు ఇన్సూరెన్స్, లైసెన్స్, సీట్ బెల్ట్, హెల్మెట్ అనేవి తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అలాగే నెంబర్ ప్లేట్లు మార్చి నడిపిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. కనుక వాహనదారులు ఎవరైనా ఉప్పల్ రింగ్ రూట్ వైపు వెళ్లనుంటే ఈ లేటెస్ట్ అప్డేట్ ను తెలుసుకోవడం మంచిది.