Dharani
ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మార్మొగిపోతుంది. ట్విట్టర్‌లో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వివరాలు..
ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు మార్మొగిపోతుంది. ట్విట్టర్‌లో ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ వివరాలు..
Dharani
కుమారి ఆంటీ.. మీడియా, సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే కనిపిస్తుంది, వినిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని.. కుమారి ఆంటీ పేరు అందరికి తెలిసింది. మాదాపూర్ ప్రాంతంలో ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ.. ఉపాధి పొందేది కుమారి ఆంటీ. తక్కువ ధరకు మంచి నాణ్యమైన భోజనం అందిస్తుండటంతో.. త్వరగానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఫుడ్ వ్యాన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కొందరూ ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబర్స్ కుమారి ఆంటీ గురించి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది.
తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమా టీమ్ కూడా ప్రమోషన్స్‌లో భాగంగా.. కుమారి ఆంటీ ఫుడ్ వ్యాన్ వద్దకు వచ్చారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక గత వారం రోజులుగా కుమారి ఆంటీ ఆదాయం గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె నెలకు 18 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీ హిల్స్ పోలీసులు కుమారి ఆంటీకి షాక్ ఇచ్చారు. ఫుడ్ వ్యాన్ సీజ్ చేసి… ఆమె మీద కేసు నమోదు చేశారు.
కుమారి ఆంటీ ఫుడ్ వ్యాన్ వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అందుకే ఆమె ఫుడ్ వ్యాన్‌ని సీజ్ చేశామని తెలిపారు పోలీసులు. అయితే ఈ అంశం కాస్త వివాదాస్పదంగా మారటమే కాక రాజకీయ రంగు పులుముకుంది. చాలామంది నెటిజనులు సోషల్ మీడియాలో ఆమెకి మద్దుతగా కామెంట్స్, పోస్ట్‌లు చేయడం ప్రారంభించారు. అక్కడ అంతమంది ఉంటే.. వారి ఎవరి వల్ల రాని సమస్య కేవలం కుమారి ఆంటీ ఫుడ్ వ్యాన్ వల్ల మాత్రమే వస్తుందా అని ప్రశ్నించారు. కావాలనే కక్షపూరితంగా ఆమె వ్యాన్‌ను సీజ్ చేసి.. వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారంటూ పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజనులు.
ఇక నెటిజనులు దెబ్బకు ట్విట్టర్‌లో కుమారి ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ట్విట్టర్ అంతా ఆమె గురించే రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంచితే.. ఈ అంశంపై తెలంగాణ సీఎంఓ కార్యాలయం సైతం స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాక.. అదే స్థలంలో ఆమె బిజినెస్‌ని యధావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రానున్నారని తెలుస్తోంది.