iDreamPost
android-app
ios-app

గెలిపిస్తేనే వస్తా..వేముల వాడ సభలో మంత్రి KTR కీలక వ్యాఖ్యలు!

సోమవారం వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. వేములవాడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోమవారం వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. వేములవాడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గెలిపిస్తేనే వస్తా..వేముల వాడ సభలో మంత్రి KTR కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం చాలా హీట్ మీద ఉంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమరంలో దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హారీశ్ రావు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్ని.. ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అలానే కేటీఆర్ కూడా సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. తాజాగా వేములవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

సోమవారం వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. వేములవాడలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు తరపున కేటీఆర్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తేనే మళ్లీ వేములవాడ వస్తానని, లేదంటే ఇక్కడికి రానన్నారు. అంతేకాక గెలిపిస్తే  నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్‌ ఎంత ఉంటాడు గింతంత ఉంటాడని, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. సింహం సింగిల్‌గానే వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయని సెటైర్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం వ్యక్తుల మధ్య కాదు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌  మధ్యేని కేటీఅర్ పేర్కొన్నారు.

ఈ సభలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కి కూడా కౌంటర్ ఇచ్చారు. డీకే శివకుమార్‌ వచ్చి.. మన నెత్తిన పాలుపోసి పోయిండన్నారు. అక్కడ 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పినందుకు ఇక్కడి కాంగ్రెస్సోళ్లు అతన్ని మళ్లీ ప్రచారానికి  పిలవట్లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాని, అవును ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతు​న్న యుద్ధమేని పేర్కొన్నారు. డిసెంబర్‌3న చూద్దాం ఎవరు గెలుస్తరో. తెలంగాణ భవిష్యత్‌ ఇక్కడి గల్లీలోనే డిసైడ్‌ కావాలని, కేసీఆర్‌ అంటే తెలంగాణ భరోసాని కేటీఆర్ తెలిపారు. సెంటిమెంట్‌, ఆయింట్‌ మెంట్‌లకు లొంగవద్దని ప్రజలకు కేటీఆర్ సూచించారు. రేవంత్‌ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్నాడని కేటీఆర్‌ గుర్తు చేశారు. మరి.. తాజాగా వేములవాడ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.