Venkateswarlu
Venkateswarlu
తెలంగాణలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మారు మూల గ్రామాల్లో కూడా ఎకరం పొలం పది లక్షల రూపాయలు పలుకుతోంది. ఇక, హైదరాబాద్‌లో అయితే భూముల ధరలకు నోరెళ్ల బెట్టాల్సిన పరిస్థితి ఉంది. మొన్న కోకాపేట భూముల ధరలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయలు పలికింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇలా ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ది చెందింది. దీంతో భూముల ధరలు బాగా పెరిగాయి.
తెలంగాణలో భూముల ధరలు బాగా పెరుగుతాయని దాదాపు 9 ఏళ్ల క్రితమే కేటీఆర్ చెప్పారు. అప్పట్లో ఆయన చెప్పిందే ఇప్పుడు నిజం అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేటీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రాపర్టీ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఏప్రిల్‌లోనో.. మేలోనో ఎప్పుడు ఎన్నికలు మొదలవుతాయో.. అయిన తర్వాత. తెలంగాణలో ఓ స్థిరమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మీరు ఊహించిన దాని కంటే పది రెట్లు ఎక్కువ వేగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందన్న విస్వాసం నాకు ఉంది.
మా మిత్రుల సొంతింటి కల నెరవేరాలని కోరుకుంటున్నా.. భూములు కొనుక్కోవాలనుకునే వారు ఇప్పుడే కొనుక్కోండి’’ అని అన్నారు. ఇప్పుడు సామాన్య జనం కొనుక్కోలేనంతగా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాట్లాడిన పాత వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు నాడు కేటీఆర్ చెప్పిందే నిజం అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని కేటీఆర్ 9 ఏళ్ల క్రితమే చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“In 2014, Prior to the formation of the state Government . @KTRTRS Garu shed light on the remarkable real estate boom in #Hyderabad.
As Promised by RamAnna, #Hyderabad has now become the fastest-growing city in the real estate sector.
Under the stable governance of KCR Garu.… pic.twitter.com/sPthV1xZti— Aravind Alishetty (@aravindalishety) July 14, 2023