iDreamPost
android-app
ios-app

Jr.NTR ఫ్లెక్సీల తొలగింపుపై.. కొడాలి నాని ఘాటు విమర్శలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అయితే ఇక్కడే వివాదం నెలకొంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అయితే ఇక్కడే వివాదం నెలకొంది.

Jr.NTR ఫ్లెక్సీల తొలగింపుపై..  కొడాలి నాని ఘాటు విమర్శలు!

తెలుగు దేశం వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దిగ్గజ నటుడు దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవళ్లు కమ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ చేరుకుని.. తాతయ్య సమాధికి నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలను చూసిన ఆయన ఆవేశంతో ఊగిపోతూ వాటిని తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దీంతో వెంటనే యంగ్ టైగర్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. వాళ్ల నీచాతి నీచమైన బుద్ది బయటపడిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణల పేరు ప్రస్తావించకుండా విమర్శలు సంధించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయనకు వర్ధంతి చేస్తారా అంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు నష్టమేమైనా ఉందా..? వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు కలిసినా.. జూనియర్ ఎన్టీఆర్‪ను ఏం చేయలేరు. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోసం దించేశారు. అల్లుడి లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని కొడాలి నాని మండి పడ్డారు.

kodali nani fire on flexi issue

కాగా, కొన్నాళ్ల నుండి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కుటుంబాల మధ్య దూరం పెరిగిందని, వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని మీడియా కోడై కూస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక.. బీజెపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న పురంధేశ్వరి సైతం స్పందించగా.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించలేదు.. అలాగే ఏ రకమైన ట్వీట్ చేయలేదు. దీంతో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని హల్ చల్ చేశాయి. అలాగే ఇటీవల భగవంత్ కేసరి సినిమా రిలీజ్ సమయంలో బాలయ్యను.. స్కిల్ స్కాంలో తారక్ స్పందించకపోవడంపై ప్రశ్నించగా.. ‘బ్రో ఐ డేంట్ కేర్’ అంటూ సమాధానం ఇచ్చాడు బాలయ్య.  ఇప్పుడు యంగ్ టైగర్ పై అక్కసు వెళ్లగక్కుతూ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది. మరీ బాలయ్య ఫ్లెక్సీలు తొలగించమనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.