iDreamPost
android-app
ios-app

ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటంటే?

ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటంటే?

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వినాయక చవితి పండగ రానే వచ్చింది. నవరాత్రుల పాటు ఆ గణేశుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ కోరికలు కోరుకుంటుంటారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సందడి అప్పుడే మొదలైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ బడా గణనాధుడిని దర్శించుకుంటారు. ఇక సోమవారం తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని ప్రత్యేక పూజ చేశారు. అయితే ఈ ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటుంది. ఇంతకు ఈ ఏడాది ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? అసలు ప్రత్యేకతలు ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.

ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకతలు:

  • ప్రతీ ఏడాది ఈ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంటారు.
  • గతేడాది ఖైరతాబాద్ వినాయకుడిని 50 అడుగుల ఎత్తులో నిర్మించారు.
  • ఈ ఏడాది శ్రీ దశమహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు.
  • ఈ ఏడాది మాత్రం ఏకంగా 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పులో నిర్మించారు.
  • వెనకాల భాగంలో సంస్కృతంలో రాసిన వచనం కనిపిస్తుంది.
  • తలపై ఏడు సర్పాలు ఉన్నాయి. దీంతో పాటు 10 చేతులు, పాదాల వద్ద 10 అడుగల ఎత్తున వరాహ దేవి, సర్వస్వతి విగ్రహాలు ఉన్నాయి.
  • మండపానికి ఇరువైపుల పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.
  • 150 మంది కళాకారులు దాదాపు 100 రోజుల పాటు శ్రమించి ఈ శ్రీ దశమహా విద్యా గణపతి విగ్రహాన్ని రూపొందించారు.

ఇది కూడా చదవండి: ఈసారి ఆకాశాన్ని అంటుతున్న వినాయకుడి విగ్రహాల ధరలు!