P Venkatesh
టీచింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకోవాలని చూస్తున్నారా? యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమా? అయితే ఇదే మంచి అవకాశం.
టీచింగ్ ప్రొఫెషన్ ను ఎంచుకోవాలని చూస్తున్నారా? యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమా? అయితే ఇదే మంచి అవకాశం.
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే సరైన అర్హతలు ఉండాల్సిందే. దాంతో పాటు ప్రభుత్వం నిర్వహించే పోటీపరీక్షల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలి. అయితే కొన్ని ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ విద్యార్హతలు ఉంటే చాలదు. ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక అర్హత పరీక్షల్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సాదారణంగా టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మరి మీరు కూడా ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నారా? అయితే ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు.
యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే సెట్ పరీక్షలో అర్హత మార్కులు సాధించాలి. కాగా ఆ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శనివారం సెట్ కార్యాలయంలో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆగస్టు 28నుంచి సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. సెట్ పరీక్షను రాయాలనుకునే వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ – 2024 పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈనెల 14నుంచి జూలై 2వరకు సెట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. అపరాధ రుసుముతో 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్లను ఆగస్టు 20నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం www.telanganaset.org వెబ్‌సైట్‌లను సంప్రదించాలని సూచించారు. మరి మీరు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు పోటీ పడాలనుకుంటే వెంటనే సెట్ పరీక్షకు అప్లై చేసుకోండి.