Somesekhar
వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Somesekhar
గత 15 రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న, మెున్న కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపించిన వర్షాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. రెండు రోజులు గ్యాప్ ఇచ్చిందని సంతోషపడేలోపలే.. మళ్లీ వర్షాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం రాత్రి నుంచే రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, కేరళ నుంచి గుజరాత్ వరకు ద్రోణి కొనసాగుతోందని దాంతో తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.