iDreamPost
android-app
ios-app

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్! మీ తలరాత మార్చుకునే ఛాన్స్ ఇది!

  • Published Aug 05, 2024 | 9:24 PM Updated Updated Aug 05, 2024 | 9:24 PM

Bhattivikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలు చేశారు.

Bhattivikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలు చేశారు.

తెలంగాణ యువతకు గుడ్ న్యూస్! మీ తలరాత మార్చుకునే ఛాన్స్ ఇది!

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. మహిళా సంక్షేమంతో పాటు.. ఈ మధ్యనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు. తాజాగా యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఎండవల్లిలో ఇండస్ట్రీయల్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్బంగా తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ అందించారు.  తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు వస్తే రుణాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. తెలంగాణలో  పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీయల్ పార్క్ తెలంగాణకే రోల్ మోడల్ గా ఉండాలని అన్నారు.

తెలంగాణలో పరిశ్రలు స్థాపించి యువత వారి తలరాతనే మార్చుకునే అద్భుతమైన అవకాశం రేవంత్ సర్కార్ కల్పిస్తుంది. ఇందుకోసం సమాజంలో అన్ని వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మధిర పట్టణ విస్తరణకు కావాల్సిన బైపాస్ రోడ్లు నిర్మిస్తాం. ఇండస్ట్రీయల్ పార్క్ కు రూ.44 కోట్లు కేటాయించామన్నారు. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కేంద్రంగా మధిరను నిలుపుతామన్నారు. గ్రామాల్లో ఉన్న యువత పరిశ్రమల వైపు మళ్లితే ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. ఈ సదవకాశాన్ని యువత వినియోగించుకొని బంగారు భవిష్యత్ కి పునాదులు వేసుకోవొచ్చని అన్నారు. నిరుద్యోగ యువతకు ఇదో గొప్ప సదావకాశం అని అంటున్నారు.