iDreamPost
android-app
ios-app

IIT హైదరాబాద్ ఘనత.. దేశంలోనే మొట్టమొదటి ప్రోటో టైప్ బ్రిడ్జ్ నిర్మాణం..!

IIT Hyderabad Devloped First Proto Type Bridge: ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలోనే మొట్ట మొదటి ప్రోటో టైప్ బ్రిడ్జిని తయారు చేసి ఔరా అనిపించారు.

IIT Hyderabad Devloped First Proto Type Bridge: ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలోనే మొట్ట మొదటి ప్రోటో టైప్ బ్రిడ్జిని తయారు చేసి ఔరా అనిపించారు.

IIT హైదరాబాద్ ఘనత.. దేశంలోనే మొట్టమొదటి ప్రోటో టైప్ బ్రిడ్జ్ నిర్మాణం..!

ఐఐటీ హైదరాబాద్ అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలోనే మొట్ట మొదటి ప్రోటో టైప్ బ్రిడ్జిని నిర్మించి శభాష్ అనిపించుకుంది. యువ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ ఘనతను సాధించింది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ప్రోటో టైప్ బ్రిడ్జిని ఐఐటీ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. లోడ్ పరీక్షలు అన్నీ నిర్వహించిన తర్వాతే పాదచారులు నడిచేందుకు 7.5 మీటర్ల వంతెనను నిర్మించారు. ఈ నిర్మాణాన్ని ఐఐటీ హైదరాబాద్ లోని కేవీఎల్ సుబ్రమణ్యం- అతని రీసెర్చ్ టీమ్ తో పాటుగా.. డిపారట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ సభ్యులు కలిసి తయారు చేశారు.

త్రీడీ ప్రింటింగ్ గురించి తరచుగా వింటూనే ఉంటారు. కానీ, దానిని ఆచరణలోకి తీసుకొస్తే నిర్మాణాలు ఎంత వేగంగా.. ఎంత బలంగా రూపొందించవచ్చు అనే విషయాన్ని ఐఐటీ హైదరాబాద్ టీమ్ చేసి చూపించింది. కాంక్రీట్ ఉప బలాన్ని తగ్గించి ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో డిజైన్ మెథడాలజీ, మెటీరియల్ ప్రాసెసింగ్ లో అనేక లెవల్స్ హైలెట్ గా ఉన్నాయి. ఇది ఆట్పమైజ్ అప్లికేషన్ త్రీడీ టెక్నాలజీ. తక్కువ బరువుతో వేగంగా.. ఎంతో సమర్థవంతంగా వంతెనలను మాత్రమే కాకుండా.. నిర్మాణాలను కూడా అభివృద్ధి చేయచ్చు. ఈ వంతెనను నిర్మించిన సుబ్రహ్మణ్యం బృందాన్ని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ప్రత్యేకంగా అభినందించారు.

బీఎస్ మూర్తీ మాట్లాడుతూ.. వేగంగా, సమర్థంగా నిర్మాణాలు చేసేందుకు టెక్నాజీతో కూడిన పరిష్కారాలు ఎంతో అవసరం అంటూ వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఇది ఒక ముందడుగు అని ప్రశంసించారు. సమర్థమైన నిర్మాణం కోసం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి చేయడం మంచి పరిణామం అన్నారు. ఇలాంటి నిర్మాణాలు, ఆవిష్కరణలతో ఆర్థికంగా, స్థానిక అభివద్ధికి మాత్రమే కాకుండా.. మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చు అని అభిప్రాయా పడ్డారు. ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని బీఎస్ మూర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఐఐటీ హైదరాబాద్ సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.