28 లక్షల ఉద్యోగం వదిలేసి.. నెలకు కోటి సంపాదిస్తున్న ఐఐటీ గ్రాడ్యుయేట్

నేటి యువత ఆలోచన విధానం మారుతోంది. ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి అభిరుచులకు తగ్గట్లుగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా నలుగురుకి ఉపాధి కల్పిస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు.

నేటి యువత ఆలోచన విధానం మారుతోంది. ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి అభిరుచులకు తగ్గట్లుగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా నలుగురుకి ఉపాధి కల్పిస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు.

జీవితంలో ఉన్నతంగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సాదించి స్థిరపడాలని ప్రతిఒక్కరు కలలుకంటుంటారు. తమ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఎన్ని అవరోధాలు ఏర్పడినా వాటన్నింటిని ఎదుర్కొని లక్ష్యం దిశగా ప్రయాణం సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందితే, మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఐఐటీ వంటి ఉన్నతమైన విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు. ఆ తరువాత ప్రముఖ కంపెనీలో రూ. 28 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. కానీ తనకు అదేమీ సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసాడు. కానీ ఇప్పుడు ఏకంగా నెలకు కోటి రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేస్తున్నాడంటే?

కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా. కానీ ఆ యువకుడు అవలీలగా వదిలేసాడు. ఉద్యోగం కంటే వ్యాపారమే మిన్న అని నమ్మాడు. బిజినెస్ ప్రారంభించాలనే తన కల కోసం ఏడాదికి రూ. 28 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసాడు. బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఆ యువకుడు మరెవరో కాదు సాయికేష్ గౌడ్. ఇతడు ఐఐటీ వారణాసి నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యాపార వేత్త కావాలన్న తన కల కోసం వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలేసాడు. ఆ తర్వాత వ్యాపారంలో సక్సెస్ అయి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

ఉద్యోగాన్ని వదిలేసి ఆ తర్వాత కంట్రీ చికెన్ కో అనే కంపెనీని స్థాపించిన సాయికేశ్ దీని ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నాడు. వ్యాపారంపై సాయికేశ్‌ కు ఉన్నటువంటి అంకితభావం, నిబద్దతను గమనించిన హేమాంబర్‌రెడ్డి అతనితో చేతులు కలపడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ సమీ ఉద్దీన్‌తో కలిసి ‘కంట్రీ చికెన్ కో.’ ప్రారంభించారు. కాగా హేమాంబర్ రెడ్డికి పౌల్ట్రీ పరిశ్రమలో మంచి నైపుణ్యం ఉంది. దీంతో కంట్రీ చికెన్ కో అనతి కాలంలోనే విజయం సాదించింది. ఈ ప్రయాణంలో సాయికేష్ ఎన్నో ఆటుపోటులకు గురయ్యాడు.

అయినా పట్టు వదలకుండా ముందుకు సాగాడు. ఇప్పుడు సాయికేష్ మరియు అతని బృందం భారతదేశపు మొట్టమొదటి ప్రామాణికమైన ఆర్గానిక్ చికెన్ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ప్రగతినగర్‌లో ఈ రెస్టారెంట్లను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాక 70 మందికి ఉపాధి లభించింది. కంట్రీ చికెన్ కో. ఇది దక్షిణ భారత రాష్ట్రాలలో 15,000 మంది రైతులతో టై-అప్‌లను కలిగి ఉంది. వారి నుండి నాటు కోళ్లను కొనుగోలు చేస్తుంది. ఇకపై కంట్రీ చికెన్ కో. తాజా నివేదికల ప్రకారం, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 5 కోట్లను ఆర్జించనుంది.

Show comments