CM రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం! ఇకపై జిల్లాల్లోనూ…

Revanth Reddy: హైడ్రా.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. హైదరాబాద్ నగరంలో చెరువులను,కుంటలను ఆక్రమించి.. కట్టడాలను నిర్మించిన వారి పాలిట సింహ స్వప్నంగా మారింది. తాజాాగా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచల నిర్ణయం తీసుకున్నారు.

Revanth Reddy: హైడ్రా.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. హైదరాబాద్ నగరంలో చెరువులను,కుంటలను ఆక్రమించి.. కట్టడాలను నిర్మించిన వారి పాలిట సింహ స్వప్నంగా మారింది. తాజాాగా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచల నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాంన్స్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ..సింపుల్ గా హైడ్రా. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. హైదరాబాద్ నగరంలో చెరువులను,కుంటలను ఆక్రమించి.. కట్టడాలను నిర్మించిన వారి పాలిట  సింహ స్వప్నంగా మారింది. అక్రమ కట్టాలను నేలమట్టం చేస్తూ.. హైడ్రా దూసుకెళ్తోంది. ఇక ఈ వ్యవస్థ తీసుకున్న చర్యలతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా  సీఎం రేవంత్  రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఏకంగా.. జిల్లాలపై ఫోకస్ పెట్టారు. మరి.. రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూద్దాం….

మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే హైడ్రా తరహాలో మరో సంచలన నిర్ణయం సీఎం  రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని, హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ఆయన తెలిపారు. జిల్లాల్లో కూడా చెరువులు,కుంటలు ఆక్రమించడంపై నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

చెరువులు, కుంటలను కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా విడిచిపెట్టవద్దని సూచించారు. అదేవిధంగా న్యాయస్థానల నుంచి సమస్యలు రాకుండా కోర్టుల నుంచి పర్మిషన్లు తీసుకుని ఆక్రమణలను తొలగించాలన్నారు. అక్రమ కట్టడాల వల్లే  భారీగా ఇళ్లు నీట మునిగాయని, 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన పడిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నప్పటికీ అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. అయితే ప్రభుత్వ ముందు చూపు వల్లే ప్రాణనష్టం తప్పిందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు మాత్రం దెబ్బ తిన్నాయని, బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ల కష్టాల గురించి తెలుసుకున్నామని తెలిపారు.

త్వరలో వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం తెలిపారు. పట్టణంలోని రాం నగర్ అక్రమ కట్టడాలను తొలగించడం వల్లే వరద ముప్పు తప్పిందన్నారు. ఇకపై చెరువు అక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఇలాంటి కట్టడాలకు సహకరించిన అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురించి ప్రస్తావించారు. ఖమ్మం జిల్లా కాలువలను కూడా వదల్లేదని, పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరదలకు  ప్రాణ నష్టం తనను  కలచివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులు కబ్జాలు చేయడం దారుణమైన నేరమన్నారు. ఆక్రమణలకు పుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్నారు. అందుకే ఎన్ని ఒత్తిడిలు వచ్చినా  హైడ్రా వెనక్కి తగ్గకుండా పని చేస్తుందని తెలిపారు.

Show comments