Swetha
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు మోత మోగిపోతుంది. ఇప్పుడు ప్రపంచ కుబేరల వివరాలలో కూడా టాప్ 10 బిలియనీర్లు.. హైదరాబాద్ కు చెందిన వారేనట.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు మోత మోగిపోతుంది. ఇప్పుడు ప్రపంచ కుబేరల వివరాలలో కూడా టాప్ 10 బిలియనీర్లు.. హైదరాబాద్ కు చెందిన వారేనట.
Swetha
మంచి చదువులు చదువుకోవాలన్నా.. ఉన్నత ఉద్యోగాలు చేయాలన్నా.. వ్యాపారాలు చేయాలన్నా ఇలా దేనికైనా కూడా.. అందరికి గుర్తొచ్చేది.. భాగ్యనగరమే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ అంటే ఓ ప్రత్యేక అభిమానం ఉంటుంది. భాషతో, మతంతో సంబంధం లేకుండా అందరిని ఆహ్వానిస్తుంది హైదరాబాద్. అయితే, ఇప్పటికే ఐటీ హబ్ కు హైదరాబాద్ పెట్టింది పేరు. ఈ హైదరాబాద్ మహా నగరంలో ఎన్నో ఐటీ సంస్థలు, వ్యాపార సంస్థలు ఇలా చాలా ఉన్నాయి. వాటి వలన ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఈ క్రమంలో అటు ఐటీలో కానీ, ఇటు కొత్త టెక్నాలజీని.. అందిపుచ్చుకోవటంలో కానీ, ఎప్పటికప్పుడు హైదరాబాదీలు తమ సత్తాను చూపిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా మోత మోగిపోతుంది. అసలు విషయం ఏంటంటే ..
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 తాజాగా ప్రపంచ కుబేరుల వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. అయితే, వీటిలో ఆసియాకు సంబంధించిన దేశాల్లో.. మన భారతదేశం ప్రధాన పాత్ర పోషించింది. మన దేశంలో అత్యంత సంపన్నులంటే అందరికి గుర్తొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ ఏ. ఈ క్రమంలో 275 మంది బిలియనీర్లతో ప్రపంచంలోనే 3వ స్థానాన్ని.. మన దేశం సంపాదించుకుంది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఇక వారితో పాటు ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన టాప్ 10 బిలినియర్లు.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు మరెవరో కాదు.
1) దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళి దీవి.. 7 బిలియన్ డాలర్ల విలువతో..ప్రపంచ ర్యాంకింగ్ లో 381 వ స్థానం సంపాదించుకున్నారు.
2) మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థకు అధినేత .. పి.పిచ్చి రెడ్డి 6 బిలియన్ డాలర్ల విలువతో.. ప్రపంచ ర్యాంకింగ్ లో 536వ స్థానాన్ని దక్కించుకున్నారు.
3) ఇక ఇదే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థకు చెందిన పివి కృష్ణా రెడ్డి.. ప్రపంచ ర్యాంకింగ్ లో 561వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
4) హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు.. 4 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచ ర్యాంకింగ్ లో.. 942వ స్థానాన్ని దక్కించుకున్నారు.
5) ఫార్మా సంస్థల్లో ఒకటైన అరబిందో ఫార్మా అధినేత పివి రాంప్రసాద్ రెడ్డి .. 3 బిలియన్ డాలర్ల విలువతో.. ప్రపంచ ర్యాంకింగ్ లో 1024వ ర్యాంకును సాధించారు.
6) ఇక ఇదే స్థానంలో అంటే 1024వ ర్యాంకులోనే.. హెటెరో ల్యాబ్స్ అధినేత బి పార్థసారధి రెడ్డి కుటుంబం కూడా .. నిలిచారు.
7) డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధినేత కె సతీష్ రెడ్డి.. 2 బిలియన్ డాలర్ల విలువతో.. ప్రపంచ ర్యాంకింగ్ లో 1855వ స్థానాన్ని దక్కించుకున్నారు.
8) అలాగే గార్ సంస్థకు చెందిన జి అమరేందర్ రెడ్డి కూడా 1855వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
9) సువెన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత జాస్తి వెంకటేశ్వర్లు.. 2 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచ ర్యాంకింగ్ లో 2038 ర్యాంకును దక్కించుకున్నారు.
10) ఇక MSN లేబొరేటరీస్ సీఈవో ఎం సత్యనారాయణ కూడా 2038 ర్యాంకునే దక్కించుకున్నారు.
ఇలా తెలుగు రాష్ట్రానికి చెందిన వారు ప్రపంచంలోని బిలినియర్ జాబితాలో వరుసగా 10 ర్యాంకులు సాధించడం.. అందులోను వారంతా హైదరాబాద్ కు చెందిన వారు అవ్వడంతో.. అందరు ఎంతో గర్వంగా భావిస్తున్నారు. హైదరాబాదీలు ఎక్కడ ఉన్న వారి సత్తాను చూపిస్తారు అని చెప్పడానికి .. ఇప్పుడు ఈ రికార్డు మరొక ఉదాహరణగా నిలిచింది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.