Hyderabad: హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. బస్సు ఢీకొట్టి యువతి మృతి!

Hyderabad Road Accident: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో ఉన్న ఓ యువతి యువతిపై మృత్యువు పగపట్టింది. ఆర్టీసీ బస్సు చక్రాల కింద ఆ యువతి జీవితం నలిగిపోయింది.

Hyderabad Road Accident: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో ఉన్న ఓ యువతి యువతిపై మృత్యువు పగపట్టింది. ఆర్టీసీ బస్సు చక్రాల కింద ఆ యువతి జీవితం నలిగిపోయింది.

నిత్యం దేశ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ఈ  ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహాదారులపైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా హైవేలపైనే కాకుండా  జనాలు రద్దీగా ఉంటే ప్రాంతాల్లోనూ కొందరు బస్సు, లారీ, కారు డ్రైవర్ల నిర్లక్ష్యానికి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే యూసఫ్ గూడలో ఓ కాలేజీ అమ్మాయి ఆర్టీసీ బస్సు వెనకటైర్ల కిందపడి దుర్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మాదాపూర్ కొత్తగూడ సర్కిల్ లోనూ ఆర్టీసీ చక్రాల కింద మరో యువతి జీవితం నలిగిపోయింది. ఇక స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ సర్కిల్‌లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. మాధవి అనే 25 ఏళ్ల యువతి కొత్తచౌరస్తాలో రోడ్డు దాటేందుకు వెళ్తోంది. అలా మాధవి రోడ్డు క్రాస్ అవుతోన్న క్రమమంలో ఆమెను వెనకనుంచి ఆర్టీసీ బస్సు వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో సదరు యువతికి తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. డ్రైవర్‌ ఆమెను గమనించకపోవడంతో బస్సు ఆమెపై నుంచి దూసుకెళ్లడం వీడియోలో కనిపించింది.

ఇక ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చనిపోయిన యువతికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. గతంలోనూ నగరంలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అంతేకాక కొందరు మద్యం తాగి కార్లు నడిపి..పలువురు ప్రాణాలను బలి తీసుకున్నారు. కొందరు నిర్ల్యకంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతుంటే, మరికొందరు మద్యం మత్తులో వాహనం నడిపి..ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని జనాలు అభిప్రాయ పడుతున్నారు. మరి..ఇలాంటి ఘటనలు జరగ్గకుండా ఉండేందుకు నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments