P Krishna
Hyderabad Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమించుకుంటున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే విడిపోతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Hyderabad Crime News: పెద్దలను ఎదిరించి ప్రేమించుకుంటున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే విడిపోతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
P Krishna
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి డిప్రేషన్ కి గురవుతున్నారు. చాలా వరకు కుటుంబ కలహాలు, ప్రేమ వ్యాహారాలు, అక్రమ సంబంధాల కారణంగా మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశానికి గురై ఎదుటివారిపై దాడులు చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. వారిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకున్నారు.. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. జీవితాంతం కలిసిబతకాలని అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ.. ఆ యువతి బలవన్మరణానికి పాల్పపడింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..జమ్ము కాశ్మీర్ లోని బారాముల్లా మాలాపోరా ప్రాంతానికి చెందిన ఇరం నబిదార్ (23) షేక్ పేట గుల్షన్ కాలనీలో ఓ పెంట్ హౌస్ లో అద్దెకు ఉంటుంది. ఆమె బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంది. నబీదార్ నవంబర్ 8 నుంచి ఆఫీస్ కి వెళ్లడం లేదు. ఆమె స్నేహితుడు అబ్దుల్ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొద్ది సేపటి తర్వాత అబ్దుల్ కి నబిదార్ తల్లి ఫోన్ చేసి తన కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.. ఒక్కసారి ఇంటికి వెళ్లి చూసిరమ్మని చెప్పింది. ఈ క్రమంలోనే అబ్దుల్ సాయంత్రం నబీదార్ ఉంటున్న రూమ్ కి వెళ్లి తలుపు కొట్టాడు. లోపల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు.. తలుపు తెరవలేదు. దీంతో ఆందోనళ చెందిన అబ్బులు పక్కనే ఉన్న వాచ్‌మెన్ ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఆ యువతిని అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఆ యువతి ఫోన్ కాల్స్ పరిశీలించగా కొంతకాలంగా తన బాయ్ ఫ్రెండ్ తో గొడవలు జరుగుతున్నాయి. చనిపోయే ముందు కూడా కశ్మీర్ లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. తన ప్రేమ విఫలం కావడవంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు కూడా తమ కూతురికి లవ్ ఎఫైర్ ఉందని, కొంత కాలంగా మానసికంగా బాధపడుతుందని పోలీసులకు తెలిపారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంచి ఉద్యోగం, అందం ఉన్నప్పటికీ ప్రేమ విషయంలో ఫెయిల్ కావడంతో ఇరం నబిదార్ ఆత్మహత్యకు పాల్పపడటం అటు కుటుంబ సభ్యులు, ఇటు ఆమె సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అస్సలు ఊహించలేదని హైదరాబాద్ లోని ఆమె స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.