Hyd లో టెక్కీపై ఆటోలో సామూహిక అత్యాచారం!

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా కనిపించే ఆడవాళ్లను టార్గెట్ చేసుకొని అత్యాచరాలు చేయడమే కాదు.. హత్యలకు పాల్పపడుతున్నారు.

Hyderabad Crime News: ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా కనిపించే ఆడవాళ్లను టార్గెట్ చేసుకొని అత్యాచరాలు చేయడమే కాదు.. హత్యలకు పాల్పపడుతున్నారు.

దేశంలో ఆడవాళ్ల మానప్రాణాలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. మగవారితో పోటీ పడి అన్ని రంగాల్లో మహిళలకు తమ సత్తా చాటుతున్నారు. కానీ, బయట మాత్రం కామాంధుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు.ఉద్యోగాలు చేస్తు రాత్రి సమయాల్లో ఒంటరిగా ఇంటికి వెళ్లే అమ్మాయిలు ప్రతిక్షణం భయంతో వణికిపోతున్నారు. ఎక్కడ నుంచి ఏ కామాంధుడు వచ్చి కాటేస్తాడో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో యువతిని ఆటోలో అత్యాచారం చేసినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం అర్థరాత్రి ఐటీ ఉద్యోగిని గచ్చిబౌలి ప్రాంతంలో ఆర్సీపురం వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ప్రయాణిస్తుంది. రాత్రి 2:30 ప్రాంతంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా నిర్మాణుశ్యంగా ఉంది. అదే సమయంలో అక్కడికి ఓ యువకుడు వచ్చి ఆటో ఎక్కడు.. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పపడ్డారు. ఆ తర్వాత యువతి వద్ద ఉన్న బ్యాగ్, డబ్బులు లాక్కున్నారు.

ఈ అమానుష ఘటన అనంతరం యువతి అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకొని బయటపడింది. తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే ఆ  యువతిని వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరటించారు.  యువతి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.  చుట్టు పక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.  ఇటీవల హైదరాబాద్ లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అత్యాచారాలు, హత్యలపై ఆందోళన వ్యక్తమవుతుంది. మహిళల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని, నింధితులను కఠినంగా శిక్షించాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show comments