Revanth Reddy: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం.. 32 ఎకరాల్లో.. అత్యాధునిక సౌకర్యాలతో

Revanth Reddy-New Osmania Hospital, Hyderabad: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. ఆ వివరాలు..

Revanth Reddy-New Osmania Hospital, Hyderabad: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. ఆ వివరాలు..

ఉస్మానియా ఆస్పత్రి తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన హస్పిటల్‌. నిజాం రాజుల కాలంలో.. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఆస్పత్రి.. సుమారు వందేళ్లకు పైగా తెలంగాణ వాసులకే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ వచ్చింది. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతికత, మెడికల్‌ సామాగ్రి అందుబాటులో ఉంది. అయితే సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆస్పత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రి భవనం చాలా చోట్ల దెబ్బ తిని.. కూలిపోయే పరిస్థితిలో ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌.. ఉస్మానియా ఆస్పత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తానని చెప్పుకొచ్చారు.. కానీ ఆదిశగా చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ గోషామహల్‌ని ఇందుకోసం ఎన్నుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం కోసం.. గోషామహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మంగళవారం నాడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో స్పీడ్ జాబితాలో ఉన్న 19 విధుల్లోని ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు.

హాస్పిటల్ చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పుకొచ్చారు రేవంత్‌ రెడ్డి. గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు గాను పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. అంతేకాక ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను తమ ప్రభుత్వం చేపడుతుందన్నారు. అలానే మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న బిల్డింగులను కూడా పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Show comments