iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ.. ట్రైనింగ్ పేరుతో 10 కోట్లు కాజేశారు!

Hyderabad Madhapur Software Consultancy Fraud: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సెల్టెన్సీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారిని నిండా ముంచేసింది.

Hyderabad Madhapur Software Consultancy Fraud: హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ కన్సెల్టెన్సీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారిని నిండా ముంచేసింది.

హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ.. ట్రైనింగ్ పేరుతో 10 కోట్లు కాజేశారు!

ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టాలి అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కొందరు కష్టపడి టాలెంట్ చూపించి ఉద్యోంగ కొడితే.. కొందరు మాత్రం బ్యాక్ డోర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒకటి చేసి ఉద్యోగం సంపాదించాలి అనేది వాళ్ల టార్గెట్. అందుకోసం డబ్బులు కట్టేందుకు కూడా రెడీ అయిపోతారు. మీరు అలా డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకోవాలి అంటే మార్కెట్ లో లెక్కకు మించిన కంపెనీలు, ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్ ఉన్నాయి. రూ.లక్షతో మొదలు పెడితే.. రూ.2.50 లక్షలు వరకు కట్టాలని చెబుతారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో సపోర్ట్ కూడా ఇస్తామంటారు. చివరికి ఇదిగో ఇలాగే బోర్డు తిప్పేస్తారు. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో ఒక కన్సెల్టెన్సీ అదే చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ లో ఫైడే అప్ అనే కన్సెల్టెన్సీ ఉంది. వీళ్లు సాఫ్ట్ వేర్ కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇప్పిస్తామని చెబుతూ ఉంటారు. అందుకోసం ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు చెల్లించాలి. వీళ్ల మాటలు నమ్మి దాదాపుగా 600 మంది నిరుద్యోగులు ఈ సాఫ్ట్ వేర్ కన్సెల్టెన్సీలో చేరారు. వాళ్ల నుంచి దాదాపుగా రూ.10 కోట్లు వరకు వసూలు చేశారు. కొన్నాళ్లు వీళ్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. యితే సడెన్ ఆ కన్సెల్టెన్సీ బోర్డు తిప్పేసింది. వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలాగే ఆఫీస్ కి కూడా తాళం వేసేశారు. అనుమానం వచ్చిన నిరుద్యోగులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కన్సెల్టెన్సీకి సంబంధించి మేనేజర్ లెవల్ లేదంటే.. అంతకన్నా పైస్థాయి వ్యక్తులు ఎవరూ అందుబాటులో లేనట్లు పోలీసులు తెలిపారు. మేనేజర్ స్థాయి.. లేదంటే ఉన్నత స్థాయి వ్యక్తులు దొరికితేనే ఈ కేసులో పురోగతి వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అయితే కంపెనీకి సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. నిరుద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇలా మోసం చేశారు అంటూ వాపోతున్నారు. వాళ్లకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదన్నారు. త్వరలోనే వాళ్లను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇలాంటి మోసాలు ఎన్నో చూసినా కూడా.. ఉద్యోగం వస్తుందనే ఆశతో నిరుద్యోగులు ఇంకా ఇలాంటి వాళ్లని నమ్మి మోసపోతూనే ఉన్నారు.