హైడ్రా కూల్చివేతలు అన్యాయం.. బాధితులకు అండగా KTR

హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది తెలంగాణ సర్కార్. మరింత దూకుడుగా ముందడుగు వేస్తుంది హైడ్రా. ఈ చర్యలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది తెలంగాణ సర్కార్. మరింత దూకుడుగా ముందడుగు వేస్తుంది హైడ్రా. ఈ చర్యలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝుళిపిస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తోంది. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది హైడ్రా. ఇదిలా ఉంటే.. ఇటీవలే హైడ్రాకు విసృత్త అధికారాలు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా వర్క్ చేస్తోంది. ఈ చర్యలపై ప్రజల నుండి ప్రభుత్వానికి పెద్ద యెత్తున మద్దతు వస్తున్నప్పటికీ.. ఈ కూల్చివేతల వల్ల కొంత మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారు.

అలాగే విపక్షాలు సైతం హైడ్రా చర్యలపై మండిపడుతున్నాయి. తాజాగా ఈ కూల్చివేతపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైడ్రా కూల్చివేతలు అన్యాయమంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాజకీయాలకు, రాగ ద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేయండని కోరారు. ‘ఆక్రమణలు మేము కూడా ప్రోత్సహించం కానీ అభాగ్యులకు అండగా నిలుస్తాం. ఇల్లు కూల్చివేసేటప్పుడు చిన్న పిల్లలు, మహిళలకు రోడ్డు మీద పడేయకుండా.. మరో నివాసాన్ని ఏర్పాటు చేసి అక్కడకు తరలించండి. ఈ కూల్చివేతల సమయంలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళలని చూడకుండా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వాళ్లను వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేసి తరలించాలి. ఉన్నపళంగా ఉపాధి కోల్పోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి. ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.

పేదలు, మధ్య తరగతి నిర్మించుకున్న నివాసాలపై ప్రతాపం చూపడం సరికాదని, ఎల్టీఎఫ్, బఫర్ జోన్లు అని తెలిసి కూడా వాటికి అనమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు కేటీఆర్. ‘ఇది కాంగ్రెస్ సర్కార్ చేయాల్సిన చర్య ఇది కాదు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. మానవీయత లేకుండా పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారు. బాధితులకు వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించి.. అప్పుడు కూల్చివేయాలి. హైడ్రా బాధితులందరికీ.. న్యాయపరంగా సాయం అందిస్తాం. మా పార్టీ తరుఫున, మా లీగల్ సెల్ అండగా నిలుస్తుంది. ఎవరికీ ఏ ఇబ్బంది ఉన్నా.. బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రండి. తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం. లేదంటే.. నగరంలో బీఆర్ఎస్ శాసన సభ్యుల దృష్టికి సమస్యను తీసుకు రండి.. న్యాయ పరంగా మీకు అండగా నిలుస్తాం. హైడ్రా బాధిత పేదలు కస్తూరిబాయి, వేదశ్రీ కుటుంబాలను పరామర్శిస్తాం. మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం. శని, ఆదివారాల్లో జరుగుతున్న కూల్చివేతలను హైకోర్టు సూమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు కేటీఆర్. కేటీఆర్ తీసుకున్న ఈ చర్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments