Tirupathi Rao
Hydra Commissioner clarification on FTL demolition plans: అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ వారికి ఒక క్రాలిటీ ఇచ్చారు.
Hydra Commissioner clarification on FTL demolition plans: అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ వారికి ఒక క్రాలిటీ ఇచ్చారు.
Tirupathi Rao
హైడ్రా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఎక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినా అస్సలు ఉపేక్షించడం లేదు. గంటల వ్యవధిలోనే కూల్చివేతలు చేపడుతున్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించినా.. అక్రమ కట్టడాలు కట్టినా అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేలు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యల్లో కొందరికి మాత్రం కమిషనర్ శుభవార్త చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అన్ని కట్టడాలు కూల్చమంటూ క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో రంగనాథ్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులు హడావుడి చేసి ఊరుకోవడం చేయమన్నారు. అలా కాకుండా అసలు అక్రమ కట్టడాలు కట్టాలి అంటే భయపడేలా చేస్తామంటూ హెచ్చరించారు. చాలామంది అక్రమ కట్టడాలను అధికారిక కట్టడాలు అన్నట్లు చూపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా అక్రమ నిర్మాణానికి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలోపే కూల్చేస్తాం అంటూ హెచ్చరించారు. అయితే ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రతి కట్టడాన్ని కూల్చేస్తాం అని కాదు అని చెప్పారు. అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కమర్షియల్ భవనాలను మాత్రమే కూల్చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో ఉన్న.. పాత భవనాలను కూల్చడం లేదు అని చెప్పారు. అంతేకాకుండా.. బిల్డర్స్ ని ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఫిర్యాదులు చేయాలంటూ తెలిపారు.
ఎఫ్టీఎల్ పరిధిలోని భవనాలను కూల్చేందుకు నోటీసులు అవసరం లేదు అని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పాయన్నారు. కేవలం రెండు మూడు గంటల్లోనే భవనాన్ని కూల్చేలా యంత్రాలను వాడుతున్నట్లు తెలిపారు. ఊరికే వెల్లి భవనాన్ని కూల్చేయడం కాదు.. దాని వెనుక పెద్ద ఎత్తున హోంవర్క్ చేస్తామన్నారు. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునే సమయం కూడా ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. అవతలి వాళ్లు ఎంత పలుకుబడి కలిగిన వాళ్లు, ఎంత తెలివిగా ఉంటారో.. అవన్నీ ముందే అంచనా వేసి కూల్చివేతలు చేపడతున్నట్లు తెలిపారు. ఇప్పటికి ఇప్పుడు అంతా సెట్ అవుతుంది అని చెప్పలేమన్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే.. ఒక ఐదేళ్లల్లో పరిస్థితులు మెరుగు పడచ్చు అని వ్యాఖ్యానించారు. అక్రమ కట్టడాలను ఇలాగే వదిలేస్తే.. ఇంకో పదేళ్లలో హైదరాబాద్ మ్యాప్ లో అసలు చెరువులు లేకుండా పోతాయి అయి ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.