Hyderabad: పైకి పసుపు ప్యాకెట్స్.. లోపల ఉండేది మాత్రం గంజాయి!

Hyderabad: మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ ఓ మహిళ పట్టుబడిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ ఓ మహిళ పట్టుబడిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిత్యం పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. ఎంత మందిని పట్టుకున్నా సరే.. గంజాయి దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిత్యావరస సరుకుల్లలో కలిపి అమ్మడం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమింటే స్కూల్స్, కాలేజీ ప్రాంతాల్లో విద్యార్థులకు చాక్లెట్లు రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి సారి గంజాయి, డ్రగ్స్ కు సంబంధించిన వార్తలను చూస్తూనే ఉన్నాము. అడపాదడపా నగరంలో ఎక్కడో ఒక చోట అవి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్ లో మరొక ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ.. ఓ మహిళ  పోలీసులకుపట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని ధూల్ పేట్  ప్రాంతానికి చెందిన నేహా భాయి అనే మహిళ గంజాయిని విక్రయిస్తుంది. అయితే ఆమె ఏ విధానంలో అమ్ముతుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపడక మానరు. అందరం వంట ఇంట్లో వినియోగించే పసుపు ప్యాకెట్ లో గంజాయిని..యువకులకు విక్రయిస్తుంది. ఇలా సదరు మహిళ గంజాయిని అమ్ముతుండగా ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌మెంట్ అధికారులకు పట్టుకుటున్నారు. అక్రమ రవాణాలో ఇదొక కొత్త వ్యూహం ఉందని పోలీసులు గుర్తించి అపప్రమత్తం అయ్యారు.

ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ DSP తిరుపతి యాదవ్‌, ఎస్‌ ఐ నాగరాజ్‌.. ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో మొత్తం 10 ప్యాకెట్స్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసుపు లాంటి ప్యాకింగ్స్ ను ఉపయోగించి ఎవరు గుర్తించకుండా సదరు మహిళ ప్రయత్నించింది. అయినా పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఆ మహిళను రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు.  ఆమెపై కేసు నమోదు చేసామని ఎక్సైజ్ శాఖ అధికారి తెలియజేశారు. అలాగే గంజాయి సరఫరాలో ముఠాలు అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహాన్ని చూసి పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ కొత్త దందాను వెలుగులోకి తీసుకువచ్చిన.. ఎన్ ఫోర్స్ మెంట్ టీం ను  ఆ శాఖ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి మెచ్చుకున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే.. నగరాలలో ఇలా అక్రమంగా గంజాయిని తరలించే ముఠాలు పెరుగుతూనే ఉన్నారు.

ఇటీవల కాలంలో విద్యార్థులు సైతం ఇలా గంజాయిని కూలీలకు అమ్మే ఘటన గురించి చూశాం. ఇక ఇప్పుడు మరొక ఘటన ధూల్ పేట్ లో చోటు చేసుకుంది. యువతి, యువకులు.. చిన్న పిల్లలు ఇలాంటి మోసాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలలన  ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఈ మధ్య కాలంలో పసుపు ప్యాకెట్లు, చాక్లెట్లు.. ఇలా నిత్యావసర వస్తువులలోనే గంజాయి సరఫరా జరుగుతుంది. పోలీసులు కూడా ఇకపై వీటిపట్ల ఇంకా కఠిన వైఖరి అనుసరిస్తూ… ఈ అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి తాజాగా పసుపు ప్యాకెట్ లో గంజాయి సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments